“పీపీఏల సమీక్ష జీవో”ను సస్పెండ్ చేసిన హైకోర్టు ..!

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. పీపీఏలను సమీక్షించాలంటూ ఓ కమిటీని ఏర్పాటు చేసి.. జారీ చేసిన జీవోను.. నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. పీపీఏలపై సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్‌ రాసిన లేఖను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న దాదాపు 40 విద్యుత్ సంస్థలు.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పీపీఏల సమీక్ష కోసం.. ఏపీ సర్కార్ ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని నియమించడాన్ని.. ఈ సంస్థలు.. పిటిషన్‌లో ఆక్షేపించాయి. దానికి సంబంధించి విడుదల చేసిన జీవో చట్ట విరుద్ధమని.. దాన్ని కొట్టి వేయాలని .. పిటిషన్లలో కోరాయి. పీపీఏల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో.. ఏపీ సర్కార్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు కిలోమీటర్ల వెనక్కు అన్నట్లుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ… పీపీఏలను సమీక్షించి రేట్లు తగ్గించి… వాటిలో అవినీతి జరిగిందని నిరూపించాలని… ప్రమాణస్వీకారం చేయక ముందు నుంచీ పట్టుదలగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి.. ఒక్కటంటే.. ఒక్క అంశం కూడా కలసి రావడం లేదు. మొదట కేంద్ర ప్రభుత్వం పీపీఏ ధర నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండదని.. సమీక్షించడం లాంటి పనులు చేస్తే.. అది విద్యుత్ రంగంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని లేఖ ద్వారా హెచ్చరించింది. అయినా జగన్ కేంద్రం మాటను లెక్క చేయకుండా… పీపీఏ సమీక్షకు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉన్నత స్థాయి కమిటీ వేయడంతో.. కేంద్రమంత్రి రెండో సారి మరింత ఘాటుగా లేఖ రాశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. విద్యుత్ కంపెనీల ప్రతినిధుల్ని పిలిచి.. ధరలు తగ్గించాలని.. ఓ రకంగా.. హెచ్చరికల్లాంటివి చేస్తూండటంతో… వారు.. న్యాయపోరాటం వైపు మళ్లారు.

పీపీఏల విషయంలో… ఏపీ సర్కార్ వైఖరిపై గందరగోళం ఏర్పడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా… ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా కానీ ఏపీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ధరలు తగ్గించకపోతే… ఒప్పందాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఒప్పందాలు రద్దు చేస్తే.. తమ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయన్న అంచనాతో.. ముందుగానే.. విద్యుత్ సంస్థల యజమానాలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ పీపీఏ వివాదం వల్ల ఏపీ ప్రభుత్వానికి … మూర్ఖంగా ప్రవర్తిస్తోందన్న చెడ్డపేరు తప్ప… ఇంకేం ఒరిగేలా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close