అసెంబ్లీ హైలెట్ : మరో నలుగుర్ని సస్పెండ్ చేసి సభ నడిపిన సర్కార్..!

అసెంబ్లీ నుంచి మరో నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్నీ సస్పెండ్ చేసి.. గురువారం సభ నడిపించారు. గోదావరి జలాల వినియోగంపై.. అసెంబ్లీలో జరిగిన చర్చలో సభను అడ్డుకున్నారంటూ… ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అశోక్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ, డోలా బాలవీరాంజనేయస్వామిలను ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరు బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో… మార్షల్‌ ద్వారా బయటకు తీసుకెళ్లారు. తెలంగాణలో గోదావరి జలాల ఒప్పందం విషయంలో… ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతోందని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా సీఎం జగన్మోహన్ రెడ్డి… కరువుతో జిల్లాలు అల్లాడుతుంటే.. రాజకీయాలే కావాలి అన్నట్లుంది టీడీపీ తీరని మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే.. మనుషులు అనాలా..రాక్షసులు అనాలా అర్ధంకావడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. కానీ స్పీకర్ అంగీకరించలేదు.

గోదావరి జలాల వినియోగంపై జరిగిన చర్చలో.. జగన్… ఎగువ రాష్ట్రంతో సఖ్యతగా ఉంటే.. కిందకు నీళ్లొస్తాయని మరోసారి తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలోఉంటాయన్నారు. అక్కడ కేసీఆర్‌ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేశారని … ఇక్కడ చంద్రబాబు ఏం చేయగలిగారని ప్రశ్నించారు. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందన్న జగన్ ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం దిగువన 17 బ్యారేజీలు కట్టేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అవసరమని… తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలి.. కేసీఆర్‌ మంచి వాడని జగన్ అసెంబ్లీ వేదికగా సర్టిఫికెట్ ఇచ్చారు. కేసీఆర్‌ సహకారంపై హర్షించాల్సిందిపోయి దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మనది దిగువ రాష్ట్రం..ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయన్నారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని.. ఐదేళ్ల తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందని భవిష్యత్ చెప్పారు. సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని..కలిసి కట్టుగా అడుగులు వేస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. చంద్రబాబుకు బుద్ది జ్ఞానం లేదని మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో.. వారు వాకౌట్ చేశారు. తర్వాత వైసీపీ సభ్యులు… జగన్ జల విధానంపై.. సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close