ఏపీ సర్కార్‌పై అన్నంత పని చేసిన విద్యుత్ సంస్థలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్యుత్ సంస్థలు కోర్టుకెక్కాయి. ఏపీ ప్రభుత్వంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న దాదాపు 40 విద్యుత్ సంస్థలు.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పీపీఏల సమీక్ష కోసం.. ఏపీ సర్కార్ ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని నియమించడాన్ని.. ఈ సంస్థలు.. పిటిషన్‌లో ఆక్షేపించాయి. దానికి సంబంధించి విడుదల చేసిన జీవో చట్ట విరుద్ధమని.. దాన్ని కొట్టి వేయాలని .. పిటిషన్లలో కోరాయి. మొత్తం 14 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… ఆ ఒప్పందాలను సమీక్ష చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఏం చేయాలో వివరిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనిపైనే విద్యుత్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి.

నిజానికి పీపీఏల విషయం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రెండు సార్లు కేంద్రం హెచ్చరిక లేఖలు పంపినప్పటికి.. రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతే కాదు.. సమీక్ష జరిపి.. తీరుతామని ప్రకటించింది. ఆ మేరకు విద్యుత్ కంపెనీలన్నింటికీ.. సమీక్షలకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా మొదట్లో వచ్చిన ఒకటి, రెండు కంపెనీల ప్రతినిధులను.. ధరలు తగ్గించాల్సిందేనని ఒత్తిడి తేవడంతో.. వారు నిరాకరించి. పవర్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీంతో.. పవర్ ట్రిబ్యునల్.. స్టే విధించింది. ఈ సారి అన్ని కంపెనీలు.. మాట్లాడుకుని.. నేరుగా హైకోర్టుకు వచ్చేశాయి. అన్ని కంపెనీలు కలిసి.. పధ్నాలుగు పిటిషన్లు దాఖలు చేసి.. ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని వాదించడం ప్రారంభించాయి.

నిజానికి పీపీఏల విషయంలో… ఏపీ సర్కార్ వైఖరిని ఒక్క విద్యుత్ రంగ నిపుణుడు కూడా సమర్థించని పరిస్థితి ఉంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా… ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా కానీ ఏపీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ధరలు తగ్గించకపోతే… ఒప్పందాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఒప్పందాలు రద్దు చేస్తే.. తమ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయన్న అంచనాతో.. ముందుగానే.. విద్యుత్ సంస్థల యజమానాలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏపీ సర్కార్ కు ఇది.. తీర్చుకోలేని చిక్కుముడిగా మారుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close