శ్రీవారి పరకాణి చోరీ కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అవడంతో అప్పటికప్పుడు ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ తిరుమలకు వచ్చి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని హైకోర్టుకు సమర్పిస్తారు. ఈ చోరీ వ్యవహారాన్ని,సెటిల్మెంట్ ను ఎప్పుడో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టారు. రవికుమార్ అే వ్యక్తిని పట్టుకోవడం.. ఆస్తులు రాయించుకోవడం.. లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై విచారణ జరపాలన్న డిమాండ్ ను ఆయన చేసినా..తర్వాత ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు.
తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇలా దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ చేసుకోవడం ఏమిటన్న భావన ప్రశ్నను హైకోర్టు వేసింది. అందుకే అన్ని రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించింది. కానీ పోలీసులు లైట్ తీసుకోవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.హైకోర్టు పూర్తిగా ప్రశ్నించిన తర్వాత అయినా అసలు నిందితుడు రవికుమార్ ఎక్కడ ఉన్నారో ఆరా తీయలేదు. ఆయన ఏడాదిగా ఎవరికీ కనిపించడంలేదు.
ఏళ్ల తరబడి పరకామణి నుంచి దొంగతనం చేస్తున్న రవికమార్.. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. చెన్నైలోనే ఎక్కువగా ఉన్నాయి. పట్టుబడిన తర్వాత అతని వద్ద నుండి కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించి.. మిగతా ఆస్తులను వైసీపీనేతలు, టీటీడీ అధికారులు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.అందుకే ఒత్తిడి చేసి రాజీ చేయించారని అంటున్నారు. ఆస్తులు ఎవరు రాయించుకున్నారో బయటకు వస్తే అసలు దొంగలపై క్లారిటీ వస్తుంది. కానీ పోలీసులు ఆ దిశగా ప్రయత్నించకపోవడమే అనుమానాలకు కారణం అవుతోంది.