పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని తలదన్నిన కేంద్ర బడ్జెట్ ..!

పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లను మించిపోయింది… కేంద్ర బడ్జెట్. వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే.. రూ. యాభై క్యాష్ బ్యాక్ ఇస్తామనే ఆఫర్లతో… విరుచుకపడే వ్యాలెట్ల ఆకర్షణకు పడిపోయి.. అవసరం లేకపోయినా.. రూ. వెయ్యి ఖర్చు పెట్టేసి.. రూ. యాభై సంపాదించుకున్నామని తృప్తి పడే..సగటు జీవిని.. కచ్చితంగా అదే స్థాయిలో.. మాయ చేసింది.. నిర్మలా సీతారామన్ బడ్జెట్.
ఐదేళ్లలో ప్రత్యక్ష పన్నుల ఆదాయం.. ఎనభై శాతం పెరిగింది. అంటే.. దాదాపుగా రెట్టింపు అయింది. అంటే.. ఐదేళ్లలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు రెట్టింపయ్యాయి. అయినా… ఆదాయపు పన్నులో… అదనంపై పైసా కూడా మినహాయింపు ఇవ్వలేదు. అంటే.. సగటు వేతన జీవి.. రూ. ఐదు లక్షల లోపు.. ఆదాయం సంపాదించుకునే చిరు వ్యాపారులు… తమ రోజువారీ ఖర్చులపై పన్నులు కడుతూనే… ఆదాయపు పన్నును కూడా కట్టుకోవాల్సిందే. పన్ను మీద పన్ను కట్టి ప్రభుత్వానికి మరో ఏడాది పాటు ఆదాయాన్ని పెంచాల్సిందే.

మధ్యతరగతిని పూర్తిగా పిండేసినట్లే..!

ఎన్నికల తర్వాత ఎలాంటి తాయిలాలు ప్రకటించాల్సిన అవసరం లేని లెక్కలను సిద్ధం చేసిన నిర్మలా సీతారామన్.. మధ్యతరగతిపై ఏ మాత్రం కనికరం చూపలేదు. వారి వద్ద నుండి పన్నుల రూపంలో ఎంత పిండుకునేందుకు అవకాశం ఉందో.. అంతా పిండుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై… లీటర్‌కు రూ. రెండు సెస్ విధించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని.. సెస్‌లు.. అవీ తగ్గిస్తారని.. ఆశ పడిన.. మధ్యతరగతి జనాలకు ఇది షాకే. పైగా.. ఈ సెస్‌ల ఆదాయం పూర్తిగా కేంద్రానికే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉండదు. గతంలో అరుణ్ జైట్లీ.. ఈ సెస్‌ను లీటర్‌పై రూ. ఎనిమిది విధించారు. అంతేనా… బంగారంపై.. కస్టమ్ చార్జీలు… పది నుంచి 12.5 శాతానికి పెంచారు. మధ్యతరగతి జీవులు.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని.. ఏదైనా మిగిలితే.. వాళ్ల మొదటి ప్రయారిటీ .. బంగారం కొనుగోలు మీదనే ఉంటుంది. ఆ విషయం తెలిసే… మధ్యతరగతి నుంచి వీలయినంత పిండుకునేందుకు బంగారంపై.. టాక్స్‌ను వడ్డించించి కేంద్రం. అయితే.. పిండుకున్నంత పిండుకుని… క్యాష్ బ్యాక్ ఆఫర్లలో ఇచ్చినట్లుగా… గృహరుణాలపై అదనంగా మరో రూ.లక్షన్నర వడ్డీ రాయితీని ప్రకటించారు. రూ.45 లక్షల లోపు గృహ రుణాలకు రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ ఇచ్చారు.

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రెట్టింపైనా ఇన్‌కంట్యాక్స్ పరిమితి పెంచలేదు..!

ఇవి మాత్రమే కాదు.. ఆదాయం పెంచుకునేదిశగా ప్రభుత్వం.. చాలా లెక్కలను.. బడ్జెట్‌లో సమకూర్చింది. నగదు లావాదేవీలను తగ్గించే పేరుతో.. బ్యాంక్ ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు డ్రా చేస్తే 2 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. డిజిటల్‌ పేమెంట్స్‌పై రూ.50కోట్ల వరకు పన్ను లేదని… తెలిపింది. రూ.2 కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌చార్జ్‌ విధించారు. రూ.5కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్నవారికి 7 శాతం సర్‌చార్జ్‌ అమలవుతుంది. ప్రత్యక్ష పన్నుల ఆదాయం 78శాతం పెరిగిందని ఆర్థిక మంత్రి గొప్పగా ప్రకటించారు.ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.11.37లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లుగా ప్రకటించారు. కొత్తగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు తీసుకొస్తామని ప్రకటించారు.

మహిళలు, అసంఘటిత రంగానికి కొద్దిగా మేలు..!

అయితే… మహిళలు, గ్రామీణ ప్రజలు.. అసంఘటిత రంఘానికి కాస్త మేలు చేసే కార్యక్రమాలను బడ్జెట్‌లో పొందు పరిచారు. 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు రూ.3వేలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ పథకం అమలు చేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష రుణం, స్వయం సహాయక గ్రూపులలో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్‌డ్రాఫ్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. భారత పాస్‌పోర్టు ఉన్న ఎన్ఆర్‌ఐలకు సత్వరమే ఆధార్‌ కార్డ్‌ ఇస్తామని ప్రకటించారు. స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50వేల మంది కళాకారులకు లబ్ది కల్పిస్తామని.. చేతి వృత్తిదారులకు పేటెంట్లు ఇప్పిస్తామని నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో హామీ ఇచ్చారు.

ఎప్పటిలానే తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి..!

సహజంగా చూస్తే.. తెలుగు రాష్ట్రాలకు.. మొండి చేయే చూపించారు. విభజన హామీలకు కేటాయించింది.. అత్యంత స్వల్పం. ఏపీ సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు , ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ. 8కోట్లు కేటాయించారు. ఏపీ ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు..

ఒక్క పైసా కూడా కేటాయించలేదు. హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది… కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.34,833 కోట్లు, తెలంగాణ వాటా రూ.19,718 కోట్లు అందనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close