సమీక్ష….ఓ బేబీ

తెలుగు360 రేటింగ్ : 3/5

జీవితగమనంలో జారిపోయిన వయస్సు తిరిగివస్తే అన్న పాయింట్ మగాళ్ల యాంగిల్ లో డీల్ చేసిన కథలు చూసాం. సినిమాలు చూసాం.

మగాళ్ల పాయింట్ లో యవ్వనం తిరిగి వస్తే వేసే వేషాలు, చేసే చేష్టలు ఊహలకు అందనివేం కాదు.

కానీ ఓ నాయనమ్మకు వయస్సు వెనక్కు వచ్చి, బామ్మ కాస్తే బేబీగా మారిపోతే…
ఈ యాంగిల్ లో ఆలోచించిన సినిమా ఓ బేబీ.

నాన్న అయినా కూడా ఓ మగాడి ఆలోచనా విధానం వేరుగా వుంటుంది.

ఓ అమ్మ ఆలోచనా విధానం వేరుగా వుంటుంది.

అదే ఓ బేబీ సినిమాకు కీలకమైన పాయింట్.

అమ్మాయిగా కోల్పోయినది తిరిగి వచ్చినా, అమ్మగా కోల్పోయిందే దానికన్నా ఎక్కువ అన్న భావావేశమే ఓ బేబీలో అంతర్గతంగా వున్న సౌందర్యం.

మిస్ గ్రానీ అనే విదేశీ సినిమా ఆధారం అన్న మాట పక్కన పెడితే అచ్చమైన తెలుగు సినిమాలా మార్చడంలో దర్శకురాలు నందినీ రెడ్డి, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ కలిసి చేసిన మ్యాజిక్ ఓ బేబీ.

సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి)కి కొడుకు (రావు రమేష్), కోడలు (ప్రగతి), మనవడు (తేజ). చిన్ననాటి నేస్తం (రాజేంద్రప్రసాద్), ఓ మనవరాలు కూడా వుంటారు. కోడలికి అత్తగారి తీరు నచ్చకపోవడంతో, ఇంట్లోంచి బయటకు వస్తుంది సావిత్రి. కానీ అప్పుడే ఓ చమక్కు జరిగి, పాతికేళ్ల పడుచుపిల్లగా మారిపోతుంది. డెభై ఏళ్ల నుంచి పాతికేళ్ల వయసుకు వచ్చిన బేబీ జీవితంలో జరిగిన సంఘటనలు, చివరకు బేబీ మళ్లీ బామ్మగానే వుండడానికి ఇష్టపడిన వైనమే సినిమా కథ.

ఓ బేబీ సినిమా ముగ్గురి శ్రమ ఫలితం. విదేశీ కథను అచ్చమైన తెలుగింటి కథగా మార్చడంలో దర్శకురాలు నందినీ రెడ్డి, ఆ కథకు అచ్చమైన తెలుగు నుడికారపు డైలాగులు సమకూర్చడంలో లక్ష్మీ భూపాల్, ఈ కథలోని బేబీ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన సమంత. వీళ్లదే ఈ సినిమా క్రెడిట్ అంతా.

సెన్సిటివ్ సీన్లు తెరకెక్కించడంలో నందిని రెడ్డికి మంచి ప్రతిభ వుంది. ఆ టాలెంట్ ఈ సినిమాలో మరోసారి కనిపిస్తుంది. అదే విధంగా డెభై ఏళ్ల బామ్మ మాటల్లా వుండాలి. అలా అని చాదస్తపు పదాలు పడకూడదు. నవ్వులు పూయాలి. యువతరానికి కూడా పట్టాలి. అలాంటి సంభాషణలు రాయడంలో లక్ష్మీభూపాల్ తన చాకచక్యం ప్రదర్శించారు. ఇక సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలో ఆమె ప్రదర్శించని షేడ్ లేదు. రంగస్థలం, మజిలీ తరువాత సమంత ఏ పాత్ర అయినా అవలీలగా చేసేయగలదు అని మళ్లీ మరోసారి రుజువు చేసుకుంది.
ఇదంతా పాజిటివ్ సైడ్.

అలా అని ఓ బేబీకి కాస్త నెగిటివ్ షేడ్ కూడా లేదని అనడానికి లేదు. ప్రారంభంలో బేబీ పాత్రను ఇంటి నుంచి బయటకు పంపడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి దర్శకురాలు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది. కోడలి పాత్రను, మనవళ్ల పాత్రలను బాగానే డిజైన్ చేసారు కానీ, కొడుకు పాత్రను ఆరంభంలో అంత బాగా డిజైన్ చేయలేదు. క్లయిమాక్స్ లో ఆ పాత్రను, దాని అవగాహనను చూపించిన స్థాయి ఆరంభంలో చూపించలేకపోయారు.

ఈ టేకాఫ్ సమస్యను అధిగమించిన తరువాత తొలిసగం అంతా చకచకానే సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగానే సెట్ చేసుకున్నారు. సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, కథను నడపడానికి కాస్త కష్టమే అయింది. సావిత్రి ఇంటి వైపు నుంచి, స్నేహితుడి వైపు నుంచి, మనవడి వైపు నుంచి, బాయ్ ఫ్రెండ్ అవుదామనుకునే కుర్రాడు (నాగశౌర్య) వైపు నుంచి, ఇలా రకరకాల సీన్లు వండివార్చడంతో సినిమా కాస్త లాగ్ అయిన భావన కలుగుతుంది. అయితే వీలయినంత వరకు ఫన్ ను మిస్ కాకుండా చూడడం వల్ల కొంత వరకు సినిమా సేవ్ అయింది.

దర్శకురాలు చూపించిన మరో ప్రతిభ ఏమిటంటే, వీలయినంత వరకు సినిమా ఎక్కడా గీత దాటకుండా చూపించడం. ఆఖరికి నాగశౌర్య ఇంటికి రాత్రివేళ సమంత వెళ్లే సీన్ ను కూడా చాలా సున్నితంగా, నర్మగర్భంగా డీల్ చేయడం బాగుంది.

కానీ సినిమాకు కీలక సమస్య. ద్వితీయార్థంలో సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ప్రతిభ సరిగ్గా ప్రదర్శించలేకపోవడం. మ్యూజిక్ కాంపిటీషన్ అన్న పాయింట్ చుట్టూ క్లయిమాక్స్ తిరగడం అన్నది తెలుగు ప్రేక్షకులకు పాతది కాదు. పైగా ఆ పాయింట్ లో అద్భుతమైన క్యాచీ సాంగ్ వినిపించాల్సి వుంది. ఈ సినిమాలో దర్శకురాలు విఫలమైంది ఆ పాయింట్ లోనే. ఆ మ్యూజిక్ కాంపిటీషన్ వ్యవహారాలు ఏవీ అంతగా క్లిక్ కాకపోవడంతో సినిమా ఆ సీన్లు వచ్చినపుడల్లా బోర్ అనిపిస్తుంది. ఈ బోర్ ప్రభావం దేనిమీద పడుతుందీ అంటే క్లయిమాక్స్ లోని కీలకపాయింట్ మీద.

తన అందం, తన యవ్వనం వల్ల వచ్చే ఆనందం కన్నా, తన కుటుంబం, తన కొడుకు, మనవలు అనే భావనలోంచి వచ్చే ఆనందం మిన్న అనే భావోద్వేగమైన పాయింట్ ను చెప్పడం క్లయిమాక్స్ ఉద్దేశం. కానీ ప్రీక్లయిమాక్స్ ఎప్పుడయితే కాస్త ల్యాగ్, బోర్ అనిపిస్తుందో, ఆ వెంటనే వచ్చే ఈ క్లయిమాక్స్ తో ప్రేక్షకులు ఏ మేరకు కనెక్ట్ అవుతారు అన్నదాని మీద చిత్ర విజయం ఆధారపడి వుంటుంది.

కానీ అదే క్లయిమాక్స్ లో ఇటు సమంత, అటు రావు రమేష్ కలిసి గుండెల్ని టచ్ చేస్తారు అంటే మరీ అతిశయోక్తి కాదు. దర్శకురాలు సినిమాలో వీలు దొరికినపుడల్లా కాస్త సందేశం జోడించే ప్రయత్నం చేసారు. రావు రమేష్ కొడుకుతో మాట్లాడుతూ అమ్మ గురించి చెప్పే మాటలు, స్నేహితురాలు చనిపోతే రాజేంద్రప్రసాద్ చేత చెప్పించిన సంభాషణలు, ముగింపు సన్నివేశంలో ఇలా మూడు చోట్ల ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను టచ్ చేసే ప్రయత్నం జరిగింది.

ప్రథమార్థం మొత్తం వినోదానికి, ద్వితీయార్థం మొత్తం విషయానికి కేటాయించడం అన్ని తరహా ప్రేక్షకులకు ఏమాత్రం పడుతుంది? అన్న పాయింట్ పక్కన పెడితే, ఓ విదేశీ సినిమాను అచ్చమైన స్వదేశీ సినిమాగా మార్చి, ఈ మాత్రం ఒప్పించడం గొప్ప విషయమే.

ఈ సినిమాలో సమంత చేసిన వర్క్ తక్కువేమీ కాదు. సీనియర్ నటి లక్ష్మి నటనను సింక్ చేస్తూ నటించడం, అలాగే చలాకీ అమ్మాయిగా కనిపిస్తూ, మాటల్లో ముదిమిని కనబర్చడం, అదే సమయంలో ఫేస్ లో ఆ రెండింటినీ మిక్స్ చేస్తూ కళ్లలో, ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఇవన్నీ అంత సులువుగా సాధ్యమయ్యేవి కాదు. ఎంత రిహార్సల్ చేసిందో? లేదా ఎన్ని టేక్ లు తీసుకుందో కానీ సమంత మొత్తం సినిమాను తన చుట్టూ తిప్పేసుకుని, సమంత కోసం సినిమా చూడాలి..లేదా సమంత తప్ప ఏముంది సినిమాలో? సమంత వన్ వుమెన్ షో. అనే రకరకాల కామెంట్ లకు, ప్రశంసలకు సమంత నే కారణం అవుతుంది.

సమంత తరువాత రాజేంద్ర ప్రసాద్ కూడా మంచి నటన కనబర్చాడు. సాధారణంగా ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో చాలా మంచినటన కనబర్చి, తన అనుభవాన్ని ప్రూవ్ చేసుకున్నారు. రావు రమేష్ మంచి నటుడు అని కొత్తగా చెప్పక్కరలేదు. నాగశౌర్య బాగా చేసాడు.

సాంకేతికంగా అన్ని విధాలా బాగుంది. తొలిసగంలో మంచి పాటలు అందించిన మిక్కీ నుంచి మలి సగంలో మంచి పాటలు ఎందుకు రాబట్టలేకపోయారో? ఆ లోటు లేకుండా వుంటే ఈ సినిమాకు ఏకగ్రీవంగా మార్కులు పడిపోయేవి.
మొత్తం మీద ఈ మధ్య కాలంలో మాంచి ఫ్యామిలీ సినిమా రాలేదు అన్న లోటు తీరుస్తుంది ఓ బేబీ.

ఫినిషింగ్ టచ్ ..వాట్ ఏ బేబీ

తెలుగు360 రేటింగ్ : 3/5

-శ్రీవత్స

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close