దొర‌సాని – డామినేష్ ‘ఆమె’దే!

అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న చిత్ర సినిమాల్లో ‘దొర‌సాని’ ఒక‌టి. ఈమ‌ధ్య తెలంగాణ యాస‌, సంస్కృతికి పెద్ద పీట వేస్తూ సినిమాలొస్తున్న నేప‌థ్యంలో ‘దొర‌సాని’ ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతుందా? అని ఎదురుచూస్తున్నారు. ప్ర‌చార చిత్రాల‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ కంటే, ‘దొర‌సాని’ శివానీ లుక్సే క‌ట్టిప‌డేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. త‌ప్ప‌కుండా శివానీకి ఇది మంచి డెబ్యూ అవుతోంద‌ని పిస్తోంది. చిత్ర‌బృందం కూడా శివానీ పాత్ర‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ఆ పాత్ర‌లో శివానీ ఎంత న‌చ్చితే ఈ సినిమా అంత బాగా ప్రేక్ష‌కుల‌కు చేరువ అవుతుంద‌ని భావిస్తోంది. సెట్లోనూ.. ఆనంద్ దేవ‌ర‌కొండ కంటే శివానీనే స్పార్క్‌గా, స్పీడ్‌గా ఉంటోంద‌ట‌. శివానీ చాలా షాట్స్‌ని సింగిల్ టేక్‌లో పూర్తి చేస్తోంద‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ మాత్రం కాస్త త‌డ‌బ‌డుతున్నాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెర‌పై కూడా ఆనంద్‌పై శివానీ డామినేష‌నే ఎక్కువ‌గా ఉంటుంద‌ని, సినిమా అంతా పూర్త‌య్యాక‌.. శివానీ పాత్రే గుర్తుండిపోతుంద‌ని, ఈ సినిమాతో శివానీకి మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు స్టార్‌. గొప్ప న‌టుడు. ఆనంద్‌ని విజ‌య్ తో పోల్చుకుని చూస్తే మాత్రం తేలిపోతాడేమో అన్న భ‌యం ఇప్పుడు `దొర‌సాని` టీమ్‌కి ప‌ట్టుకుంది. మ‌రి ఆనంద్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com