తేజూ కోసం రాశీఖ‌న్నా

సాయిధ‌ర‌మ్ తేజ్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కబోతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం కోసం ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ అనే పేరు ఖాయం చేసేశారు. ఇప్పుడు క‌థానాయిక కూడా ఫైన‌ల్ అయిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖ‌న్నాని ఎంచుకున్నారు. ఈనెల 27న షూటింగ్ ప్రారంభం కానుంది. నిజానికి రాశీ అస‌లు క‌థానాయిక రేసులోనే లేదు. నిధి అగ‌ర్వాల్‌ని ఫైన‌ల్ చేద్దామ‌నుకున్నారు. చివ‌రి నిమిషంలో రాశీఖ‌న్నా వ‌చ్చి చేరింది. సాయిధ‌ర‌మ్ – రాశీఖ‌న్నాలు ‘సుప్రీమ్’ కోసం జోడీ క‌ట్టారు. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బాగానే ఆడింది. ఇప్పుడు మ‌రోసారి.. ఈ ‘సుప్రీమ్‌’ కాంబో అల‌రించ‌బోతోంది. త‌మ‌న్ సంగీతం అందించే ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com