‘ర‌ణ‌రంగం’ లుక్‌: కాజ‌ల్ క‌ళ క‌ళ‌

చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టి ఇన్నేళ్ల‌యినా కాజ‌ల్ గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ల‌క్ష్మీక‌ల్యాణంలో ఎలా ఎందో, ఇప్ప‌టికీ అలానే ఉంది. కాక‌పోతే రెండు మూడు సినిమాలుగా కాజ‌ల్ లుక్ కాస్త మారింది. ‘సీత‌’లో అయితే మ‌రీ డ‌ల్ అయిపోయింది. గ్లామ‌ర్ కంటే పెర్‌ఫార్మెన్స్ వైపే ఎక్కువ దృష్టి పెట్ట‌డం వ‌ల్లేమో – కాజ‌ల్‌లో ఇది వ‌ర‌క‌టి క‌ళ క‌నిపించ‌లేదు. అయితే ఇప్ప‌డు ‘ర‌ణ‌రంగం’ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈరోజు కాజ‌ల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలోని కాజ‌ల్ లుక్‌ని విడుద‌ల చేశారు. ఈసారి మాత్రం కాజ‌ల్ ఏమాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. ఐదారేళ్ల క్రితం ఎలా ఉందో.. అచ్చం అలానే ఆ మాట‌కొస్తే అంత‌కంటే ఒకింత ఎక్కువ గ్లామ‌ర్‌గానే క‌నిపించింది. శ‌ర్వా ప‌క్క‌న కాజ‌ల్ ఏంటి? జోడీ బాగుంటుందా? అని అనుమానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ స్టిల్ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించేలానే ఉంది. కాజూ పాప ఇదే లుక్ కొన‌సాగిస్తే మాత్రం మ‌రో రెండు మూడేళ్లు త‌న కెరీర్‌కి ఢోకా లేన‌ట్టే. ఈ యేడాది నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాల‌ని భావిస్తున్న కాజ‌ల్ కు అక్క‌డే మంచి ఫ‌లితాలే రావాల‌ని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే కాజ‌ల్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రామ్ చ‌ర‌ణ్ కోసం ప్లాన్ బి

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇది వ‌ర‌కే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌పై యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ షెడ్యూల్‌కి...

తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.....

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

తెలంగాణతో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. స్మూత్‌గా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాల్సిన ఏపీ ప్రభుత్వం... అనవసర వివాదంతో.. కేఆర్ఎంబీ దృష్టిలో పడేలా చేసుకుంది. ఫలితంగా.. ఇప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉంటే తప్ప.....

“గాసిప్‌ సైట్‌”పై లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ ఫిర్యాదు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈగ వాలినా సహించలేకపోతున్న గాసిప్‌ సైట్‌కు.. ఆ పార్టీ ఎంపీ నుంచే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా కథనాలు రాస్తున్నారంటూ.. గాసిప్ సైట్‌పై.. వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close