హోదా రాదు.. ప్యాకేజీ వద్దన్నారు..! ఏపీ రెంటికి చెడ్డ రేవడైపోయిందా..?

ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం నిశితంగా పరిశీలించేవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. హోదా ప్రాముఖ్యతను బలంగా చెప్పి… ఇస్తామన్న హామీ కాబట్టి.. ఇవ్వాలని.. గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ ఆ తీర్మానంలో… ప్యాకేజీ ప్రస్తావన తీసుకు రావడమే.. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్యాకేజీ వద్దే వద్దని.. నొక్కివక్కాణించాల్సిన అవసరం ఏమిటో.. రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాల్సి ఉంది.

ప్యాకేజీ వద్దంటే హోదా ఇస్తారా..?

అసెంబ్లీ చేసిన తీర్మానంలో.. ప్రధానంగా… ప్యాకేజీ వద్దే వద్దని చెప్పారు. గత ప్రభుత్వం.. హోదా ప్రయోజనాలన్నీ కలిపి ఉండేలా.. ప్యాకేజీ ఇస్తామని చెప్పడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగా.. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కలిగేవి. అయితే.. చివరికి… టీడీపీతో రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో.. ప్యాకేజీని అమలు చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమని.. ఇంకో లింక్ పెట్టారు. దాంతో.. అ ప్యాకేజీ ఎటూ కాకుండా పోయింది. అంటే.. ఆ ప్యాకేజీ ఇప్పటికీ అమలు కాలేదని అర్థం. అలాంటప్పుడు.. ఆ ప్యాకేజీని వద్దే వద్దని ప్రత్యేకంగా తీర్మానం చేయడం ఎందుకో.. టీడీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ప్యాకేజీ వద్దంటే హోదా ఇస్తారన్నట్లుగా… తీర్మానం ఉండటంతో.. టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

చంద్రబాబు చేసిన తీర్మానాలకు… జగన్ చేసిన తీర్మానానికి తేడా ఏంటి..?

నిజానికి ప్రత్యేకహోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు తమదైన వాదన వినిపిస్తున్నారు. గతం కంటే గట్టిగా ఇప్పుడు… హోదా అనేది ముగిసిన అధ్యాయమని ప్రకటిస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు.. ఒక్క మాట అంటే. .ఒక్క మాట కూడా ఖండించడం లేదు.కానీ.. తాము అడుగుతామంటూ హడావుడి చేస్తున్నారు. అసెంబ్లీల్లో తీర్మానాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. వాటిని ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు సీఎం హోదాలో.. మళ్లీ అవే తీర్మానాలు చేసి .. కేంద్రానికి పంపుతున్నారు. ఇద్దరు సీఎంలూ అదే చేశారు. చంద్రబాబు… ప్యాకేజీ తీసుకుంటామని.. హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఎంతో కొంత వస్తాయని ఆయన ఉద్దేశం కావొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అసలు ప్యాకేజీ కూడా వద్దనుకుంటారు.

ఏపీ రెంటికి చెడ్డ రేవడి కాబోతోందా..?

ప్రత్యేకహోదా అనేది.. 2014లో ఇచ్చిన హామీ. అప్పటి ప్రభుత్వ కాలపరిమితి కూడా ముగిసిపోయింది. హోదా ఇవ్వబోమన్న నినాదంతోనే… బీజేపీ 2019 ఎన్నికలకు వెళ్లింది. ఇప్పుడు.. ఆ పార్టీకి ఎలాంటి హోదా బాధ్యత లేదు. గతం.. గతహా.. అనుకునే పరిస్థితి. ఇప్పుడు… ఏపీ సర్కార్.. ప్యాకేజీ కూడా వద్దనేసింది. దాంతో.. ఇప్పటి వరకూ… అమలు చేయాలా వద్దా.. అన్న డైలమాలో ఉన్న కేంద్రం.. ప్యాకేజీకి కూడా… జెల్లకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే… మొత్తంగా.. ఏపీకి అటు హోదా రాదు.. ఇటు ప్యాకేజీ ఇవ్వరు. ఏపీ మొత్తానికి దగా పడినట్లు అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులతో రేవంత్ దూకుడు..!

మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్జీటీ వేసిన కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. జన్వాడలో ఉన్న కేటీఆర్...

ఏపీ సచివాలయంలో పది మందికి వైరస్..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో పని చేసే ఓ అధికారి డ్రైవర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ పది మంది సచివాలయ ఉద్యోగులకు...

ఫీజు కోసం మోహన్‌బాబు ఇప్పుడు కోర్టుకెళ్లరా..?: టీడీపీ

ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పేరు మార్చి.. నిబంధనలు మార్చి.. ప్రజాధనాన్ని ప్రైవేటు కాలేజీలకు దోచి పెడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అర్హత లేని కాలేజీల్లోనూ ఇష్టానుసారం ఫీజులు...

HOT NEWS

[X] Close
[X] Close