ఓపెనింగ్ సూన్..! మానవ నిర్మిత మహాద్భుతం.. కాళేశ్వరం..!

మానవనిర్మిత మహాకట్టడంగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గురించి… మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. ఆ తరహాలో… భవిష్యత్‌లో.. తెలంగాణ గురించి మానవ నిర్మిత మహాద్భుతంగా చెప్పుకునే ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీని డిజైన్ భిన్నం..! లక్ష్యం…భిన్నం..! నీటిని అందిపుచ్చుకునే విధానం…! జలం పరుగులు తీసి.. పొలం చేరే విధానం కూడా భిన్నాం..! అందుకే అద్భుతం..!

సస్యశ్యామలం చేసే జలప్రవాహం..!

తెలంగాణలోని 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు మూడేళ్ల రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయ‌బోతున్నారు. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్ ర‌న్ ప్రారంభం కాబోతోంది. ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డ ఆనకట్ట, కన్నేపల్లి పంపు హౌజ్ వద్ద ఏకకాలంలో హోమాలు నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ వద్ద పైలాన్ ఆవిష్కరణ, కన్నేపల్లి వద్ద స్విచాన్ ముఖ్యమంత్రులు స్విచ్చాన్ చేస్తారు. 2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. గోదావరి, ప్రాణహిత నది కలిసే చోట మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వరూపం ఉంటుంది. దాదాపు 80 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

ఎత్తిపోయడంలో ప్రపంచరికార్డు ఖాయం..!

కాళేశ్వరం గ్రావిటి కెనాల్ పొడవు 1531 కి.మీ. సొరంగాల పొడవు 203కి.మీ. మొత్తం పంపులు 82. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోయాలంటే మొత్తంగా 7,152 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. పంప్ హౌజ్ లో ఒక్కో మోటారుకు 40 మెగావాట్ల ప‌వ‌ర్ అవ‌సరం ఉంటుందని లెక్క తేల్చారు. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు ఉపయోగిస్తున్నారు. ల‌క్ష్మీపూర్ పంప్ హౌజ్ లో భారీ బాహుబ‌లి పంపులను వినియోగిస్తున్నారు. లక్ష్మీ పూర్ పంపుహౌస్ లో బాహుబలి పంపులు… 111 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్టు చేయనున్నాయి. మొత్తంగా ఇప్పటికి 7 మోటార్లను బిగించారు. ఒక్కో పంపు కెపాసిటి లక్షా 86వేల హర్స్ పవర్ ఉంటుంది. నంది మేడారం బ్రిడ్జి.. మిడ్ మానేరు రిజర్వాయర్ ల మధ్య లక్ష్మీ పూర్ పంపు హైజ్ లో బాహుబలి పంపుల ఏర్పాటు చేశారు.

ప్రాణహిత నీరే కాళేశ్వరానికి ప్రాణం..!

ప్రాజెక్టు కోసం… మొత్తంగా80వేల ఎకరాల భూసేకరణ జరిపారు. అటవి భూమి 3050హెక్టార్లను వినియోగించుకుంటున్నారు. 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకు రానున్నారు. గత ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5టీఎంసీల కేటాయిస్తారు. కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30టీఎంసీల నీటిని తరలిస్తారు. గ్రామాల తాగునీటికి మరో 10టీఎంసీలు… పారిశ్రామికంగా అవసరాలకు-16టీఎంసీలను కేటాయిస్తారు. ప్రాణహిత నది నీటిని సద్వినియోగపర్చుకోవటమే లక్ష్యంగా కాళేశ్వరాన్ని ప్రభుత్వం నిర్మించింది.

90 శాతం పనులు పూర్తి..! మల్లన్న సాగరే పెండింగ్..!

మేడిగడ్డ వద్ద గోదావరిపై కాళేశ్వర్ మెయిన్ బ్యారేజీ ఉంటుంది. అన్నారం, సుందిళ్ళ రిజర్వాయర్ల నిర్మాణం చేశారు. రోజూ 2 టీఎంసీల చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోయనున్న లిఫ్టులు… మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ , శ్రీ పాద ఎల్లంపల్లి ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి అంకురార్పణ చేసినట్లయింది. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం నీరు అందనుంది. ఇప్పటికే 90 శాతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు పూర్తయ్యాయి. 25 టీఎంసీల సామర్యం కలిగిన మిడ్ మానేరు బ్యారేజీ కూడా పూర్తయింది. అయితే.. మల్లన్న సారగ్ నిర్మాణం మాత్రం మొదలు కాలేదు. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ ను నిర్మించాలని తలపెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close