ఇంటి నిర్మాణానికి పాతిక లక్షలు ఖర్చు అయిందనుకుంటే అందుకే ఐదు లక్షలు వృధాగా పోతాయి. ఆ విషయం తీరికగా ఆలోచించుకుంటేనే తెలుస్తుంది. వృధాను అరికడితే చాలా వరకూ డబ్బులు ఆదా అవుతాయి. ఇలా వృధాను అరికట్టే మోడలే లీన్ కన్స్ట్రక్షన్. సాధారణంగా నిర్మాణంలో సమయం, మెటీరియల్, కార్మికుల సమయం, అనవసరమైన రవాణా, ఎక్కువ ఇన్వెంటరీ వంటి కారణాల వల్ల ఖర్చు పెరుగుతుంది. ఈ లీన్ కన్స్ట్రక్షన్ ఈ వృథాను తొలగించి, గరిష్ట విలువ ని ఓనర్‌కు అందిస్తుంది.
ఈ విధానంలో ముందుగా ఇంటి నిర్మాణంలో నిజంగా ఏది ముఖ్యమో గుర్తించాలి. ప్రాజెక్టులో ప్రతి దశను మ్యాప్ చేసి, ఏ అడుగులు విలువ జోడించాలో, ఏవి వృథానో గుర్తించాలి. అనవసర రవాణా, ఎక్కువ ఇన్వెంటరీ, వేచి ఉండడం, అధిక ఉత్పత్తి, లోపాలు వంటి వాటిని గుర్తించారు. పని ఆగకుండా నిరంతరంగా సాగేలా చూడాలి. అవసరమైనప్పుడే మెటీరియల్, కార్మికులు వచ్చేలా చూసుకోవాలి, చిన్న చిన్న మార్పులతో ప్రతిరోజూ పనిలో మెరుగుదల ఉండేలా చూడాలి.
ఈ విధానం వల్ల 10–25% వరకు మెటీరియల్, కార్మిక వృథా తగ్గుతుంది. సగటున 20–30% సమయం ఆదా అవుతుంది . మెటీరియల్ వృథా తక్కువగా ఉంటుంది. ఖర్చు తక్కువ, సమయం తక్కువ ..కాంట్రాక్టర్, ఓనర్ ఇద్దరికీ ఎక్కువ లాభం ఉంటుంది.
లీన్ కన్స్ట్రక్షన్ అంటే “అనవసరమైనదంతా తీసేసి, కస్టమర్‌కు ఎక్కువ విలువను తక్కువ ఖర్చుతో, త్వరగా, సురక్షితంగా అందించే పద్ధతి”. ఇది భవిష్యత్తులో భారత నిర్మాణ రంగంలో చాలా ముఖ్యమైన పద్ధతిగా మారబోతోంది.ఇప్పటికే పలువురు అనుసరించడం ప్రారంభించారు.