తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు మరితం ఊతం ఇస్తోంది. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ దక్షిణ భాగం చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది, మన్నెగూడ, రాజాపూర్ గుండా వంటి కీలక ప్రాంతాల గుండా వెళ్తుంది.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (NH-44)తో లింక్ అవుతూ, ఈ రూట్ దక్షిణ తెలంగాణలో కాస్త వెనుకబడి ప్రాంతాల అభివృద్ధికి ఊతంగా ఉంటుంది. NH-44తో కలవడం, లాజిస్టిక్స్ హబ్‌ల సౌలభ్యం మ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు అనుకూలతలు ఉండేలా అలైన్ మెంట్ ను ఖరారు చేశారు. అప్డేటెడ్ అలైన్మెంట్ మ్యాప్‌ను HMDA వెబ్‌సైట్‌పై అప్లోడ్ చేసింది.
RRR ప్రాజెక్ట్ మొత్తం 338 కిలోమీటర్ల విస్తీర్ణంతో, 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. దక్షిణ భాగం 201 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌గా రూపొందుతుంది, ఇది సిక్స్-లేన్ డిజైన్‌తో ఉంటుంది. దక్షిణ భాగానికి రూ. 7,000-8,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మార్చివేస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో భూమి ధరలు పెరుగుతాయని లాజిస్టిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ జోన్లు, హౌసింగ్ లేఅవుట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే .. ప్లాన్లతోనే కాకుండా.. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్న వాదన వినిపిస్తోంది.