హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన పరిణామాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాస్త ముందూ, వెనుకాడుతున్నారు. అయితే క్రెడాయ్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. తన లక్ష్యం హైదరాబాద్ ను అత్యున్నత స్థాయిలో నిలబడమేనని స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు.
ఫ్యూచర్ సిటీ విషయంలో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇతర సీఎంలను వారు చేసిన పనులతో ఎలా గుర్తు పెట్టుకుంటారో.. అలాగే ఫ్యూచర్ సిటీ అంటే తన పేరు గుర్తుకు వచ్చేలా నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. రేవంత్ ఉద్దేశం … ఐటీ కారిడార్.. ఆ చుట్టుపక్కలే కాకుండా.. ఫ్యూచర్ సిటీలోనూ పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపునివ్వడమే. అందుకే వారికి ఉన్న డౌట్స్ ను క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు.
అయితే ఫ్యూచర్ సిటీ విషయంలో రోజులు గడుస్తున్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది. ఆ సిటీ మాస్టర్ ప్లాన్ ను ప్రకటించి దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై త్వరిగతిన నిర్ణయాలు తీసుకుంటే.. ప్రైవేటు పెట్టుబడిదారులు అటు వైపు చూసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా నెమ్మదిగా కదులుతోందన్న అభిప్రాయం ఉంది. అందుకే తొందరపడి వారు నిర్ణయాలు తీసుకోలేపోతున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా సున్నితమైనది.. చాలా హెవీగా ఉంటుంది. ఒక్క సారి ఎక్కడైనా ఇరుక్కుపోతే.. చాలా ఇబ్బందులు పడతారు. అందుకే అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు.
ప్రభుత్వం వచ్చే రెండు, మూడు నెలల్లో ఫ్యూచర్ సిటీ విషయంలో .. మరింత నమ్మకం కలిగించే చర్యలు తీసుకుంటే… వ్యాపారులు.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని క్రెడాయ్ సమావేశంలో వినిపించిన అభిప్రాయం.