కాస్త దూరంగా పోయి అయినా ఇండిపెండెంట్ ఇళ్లే కొనాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం హయత్ నగర్ హాట్ ఫేవరేట్ గా మారింది. చిన్న బిల్డర్లు 100 చదరపు గజం నుంచి 300 చదరపు గజాల వరకు ఇళ్లను నిర్మిస్తున్నారు, ధరలు ₹45 లక్షల నుంచి ₹1 కోటి వరకు చెబుతున్నారు. హయత్‌నగర్ చుట్టూ రెసిడెన్షియల్ ప్లాట్లు ఇంకా అందుబాటులో ధరల్లోనే ఉన్నాయి, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చదరపు గజానికి ₹35,000 నుంచి ₹50,000 వరకు. పెద్ద అంబర్‌పేట్‌లో ₹32,000 నుంచి ₹54,000 వరకు, పసుమాముల , తట్టి అన్నారంలో ₹42,000 నుంచి ₹60,000 వరకు ధరలు ఉన్నట్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.
హయత్‌నగర్ సమీపంలో భూమి ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఎకరానికి ₹3-4.5 కోట్లు, కొంచెం లోపల ₹2-3 కోట్లు. రియల్ ఎస్టేట్ నిపుణులు, రీజియనల్ రింగ్ రోడ్ మరియు రింగ్ రైల్ వంటి అవసర సదుపాయాలు మొదలైన తర్వాత భూమి మరియు రెసిడెన్షియల్ ప్లాట్ ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అపార్టుమెంట్లు కూడా విరివిగా నిర్మిస్తున్నారు. చదరపు అడుగుకు ₹3,400 నుంచి ₹4,200 వరకు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్: ₹45 లక్షల నుంచి ₹52 లక్షలు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్: ₹55 లక్షల నుంచి ₹65 లక్షలు. రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ కొన్ని డెవలపర్లు విల్లాలు నిర్మిస్తున్నారు.
హయత్‌నగర్‌కు ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ జాతీయ రహదారి ద్వారా మెరుగైన కనెక్టివిటీ ఉంది. సమీపంలో రామోజీ ఫిల్మ్ సిటీ, సంఘి టెంపుల్, మౌంట్ ఓపెరా వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇంజనీరింగ్ , ఫార్మా కాలేజీలు ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్ , రీజియనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులు హయత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తాయి. హయత్‌నగర్‌లో చాలా మంది కొనుగోలుదారులు ప్రాపర్టీలను ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంటున్నారు.