ఫస్ట్ టెస్ట్ ఫట్..! తేలిపోయిన కోహ్లీ గ్యాంగ్..!

కివీస్ పర్యటనలో టీమిండియాది ఆరంభశూరత్వంగానే మిగిలిపోయింది. ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సీరిస్‌ను.. వైట్ వాష్ చేసి గెలిచిన ఉత్సాహం.. ఇప్పుడు పూర్తిగా నీరుకారిపోయింది. మూడు వన్డే సిరీస్‌లో వైట్ వాష్ చేయించుకుని.. ఇప్పుడు తొలిటెస్టులోనూ అంతే ఘోర పరాజయం పాలయ్యారు. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్.. పది వికెట్ల తేడాతో.. టీమిండియాను ఓడించింది. ఓ దశలో ఇన్నింగ్స్ విజయం ఖాయమనుకున్నారు కానీ.. చివరికి భారత బ్యాట్స్‌మెన్లు తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. దాంతో.. ఇన్నింగ్స్ ఓటమి అనే మరక తప్పింది కానీ.. పది వికెట్ల ఘోర పరాజయం మాత్రం ఖాయమయింది.

కివీస్ బౌలర్ టిమ్ సౌధీ భారత బ్యాటింగ్ లైనప్‌ను రెండు ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకే అలౌటయింది. ఒక్కరంటే.. ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. సౌధీ, జామిల్సన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పరిస్థితి. తొలి ఇన్నింగ్స్ కంటే… కొద్దిగా పరుగులుఎక్కువగా చేయగలిగారు. 191 పరుగులకు ఆలౌటయ్యారు. టిమ్ సౌధీ ఐదు వికెట్లు తీసి.. బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. సౌధీకి బౌల్ట్ తోడవడంతో… టీమిండియా ఆటగాళ్లు నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లోనే… 348 పరుగులు చేసిన న్యూజిలాండ్‌కు.. చివరికి టీమిండియా ఇచ్చింది 9 పరుగుల లక్ష్యం.

స్టార్ ప్లేయర్లు అనుకున్న వారంతా.. చేతులెత్తేశారు. టీ ట్వంటీ విజయం తర్వాత.. విజయగర్వం తలకెక్కిందో… ఏదైనా సులువుగా గెలిచేస్తామన్న అతి నమ్మకంలో పడిపోయారేమో కానీ… తర్వాత ఒక్క చోట.. మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. కెప్టెన్ కోహ్లీ ఫాం అత్యంత దారుణంగా ఉంది. ఒకో సిరీస్‌లో రెండు, మూడు సెంచరీలు చేసే కోహ్లీ.. ఇప్పుడు .. ఓమెరుగైన ఇన్నింగ్స్ కోసం.. ప్రయత్నిస్తున్నారు.కానీ సాధ్యం కావడం లేదు. సిరీస్‌లో మరొక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇరవై తొమ్మిదో తేదీన క్రైస్ట్ చర్చ్‌లో రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఆ టెస్టులో విజయం సాధిస్తే సిరీస్ డ్రా అవుతుంది. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా… సిరీస్ పోతుంది. కివీస్ పర్యటన… ఫెయిల్‌గా మిగిలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com