విశాఖ టెస్ట్‌: భార‌త్ ప్ర‌తీకార విజ‌యం

తొలి టెస్ట్ మ్యాచ్‌లో జ‌రిగిన ప‌రాభ‌వానికి భార‌త్ త‌గిన ప్ర‌తీకారం తీర్చుకొంది. విశాఖ టెస్ట్ లో 106 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకొంది. 399 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 292 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు ద‌క్కించుకొని ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాశించారు. దీంతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో స‌మం అయ్యింది.

ఒక ద‌శ‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 399 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదిస్తుందేమో అన్న అనుమానం క‌లిగింది. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రోవైపు వేగంగా ప‌రుగులు తీస్తూ ల‌క్ష్యానికి ద‌గ్గరైంది. అయితే భార‌త బౌల‌ర్లు కీల‌క‌మైన స‌మ‌యాల్లో వికెట్లు తీశారు. బెన్ స్ట్రోక్స్ ర‌నౌట్ అవ్వ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జాక్ కావ్లీ 73 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 396 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకొన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ సెంచ‌రీతో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లానే రెండో టెస్ట్ కూడా 4 రోజుల్లోనే ముగియ‌డం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close