జీతాలివ్వలేని స్థితికి వెళ్లిపోయిన బైజూస్

ఒక్క సారిగా ఆకాశానికి ఎదిగి.. తర్వాత పాతాళానికి పడిపోయిన బైజూస్ ఎడ్యూటెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. జనవరి నెల జీతాలు ఇవ్వకపోడంతో దుమారం రేగింది. దీంతో ఉద్యోగులకు జీతాలు జమ చేసిన యజమాని రవీంద్రన్.. ఉద్యోగులకు లేఖ రాశారు. ఎంతగానో పోరాడి ఈ సారి ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు పేర్కొన్నారు. జీతాలు చెల్లించేందుకు గత కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. న్యాయంగా చట్టబద్ధమైన వేతనాన్ని పొందేందుకు ఈ సారి నేను మరింత ఎక్కువగా పోరాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు.

ఎన్నడూ లేనివిధంగా ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ అలసిపోయారని నిర్వేదం వ్యక్తం చేశారు. కష్టసమయంలో కంపెనీకి మద్దతుగా ఉన్నందుకు, జీతాల కోసం ఓపికతో ఎదురుచూసినందుకు ఉద్యోగులకు ఈ సందర్భంగా రవీంద్రన్‌ కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి బైజూస్ లో ఉద్యోగుల్ని దాదాపుగా ఎనభై శాతం వరకూ సాగనంపారు. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారికీ జీతాలు ఇవ్వలేకపోతున్నారు.

మరో వైపు కంపెనీ విలువ 80 శాతం తగ్గిపోయింది. అప్పులు చెల్లించలేక డీఫాల్ట్ అయ్యారు. ఏపీ సర్కార్ ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున ఇచ్చిన కాంట్రాక్టులతోనే ఆ సంస్థ ఇప్పటి వరకు మనుగడ సాగించిందని.. లేకపోతే దివాలా తీసి ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close