క‌ప్పు మ‌న‌దే: రెండో టీ 20లోనూ జ‌య కేతనం

ఆసీస్ చేతిలో వ‌న్డే సిరీస్ కోల్పోయిన భారత్‌.. ఇప్పుడు ప్ర‌తీకారం తీర్చుకుంది. టీ 20 సిరీస్ ని మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. ఈరోజు సిడ్నీలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్ పై ఆరు వికెట్ల తేడాతో జ‌య కేత‌నం ఎగ‌రేసింది. దాంతో టీ 20 భార‌త్ వ‌శ‌మైంది. తొలుత టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ.. ఆసీస్ కి బ్యాటింగ్ అప్ప‌గించాడు. తొలి ఓవ‌ర్ నుంచే జోరు చూపించిన ఆసీస్ బ్యాట్స్ మెన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు 194 ప‌రుగులు చేసి, భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం ఉంచారు.

భార‌త ఓపెన‌ర్లు రాహుల్ (30), ధావ‌న్ (52) శుభారంభం అందించ‌డంతో…. ప‌రుగుల వేట ధాటిగానే ప్రారంభ‌మైంది. వీరిద్ద‌రూ తొలి వికెట్ కి 56 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. కోహ్లీ (22 బంతుల్లో 42) కూడా రాణించ‌డంతో.. భార‌త్ సుల‌భంగానే టార్గెట్ అందుకుంటుంద‌నిపించింది. అయితే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కీల‌క‌మైన వికెట్లు కోల్పోవ‌డంతో.. భార‌త్ పై ఒత్తిడి పెరిగింది. అయితే… సూప‌ర్ ఫామ్ లో ఉన్న పాండ్య (22 బంతుల్లో 42) మ‌రోసారి విజృంభించ‌డంతో మ‌రో రెండు బంతులు ఉండ‌గానే.. విజ‌యాన్ని అందుకుంది. చివ‌రి ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు కావ‌ల్సివ‌చ్చిన‌ప్పుడు పాండ్యా రెండు సిక్సులు బాది.. భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close