పైలట్లు సరిపడా లేక ఇండిగో సంస్థ విమానాలను రద్దు చేస్తోంది. ఒకటి కాదు.రెండు కాదు వందల విమానాలను రద్దు చేస్తోంది. ఇప్పటి వరకూ వారి వద్ద ఉన్న పైలట్లు మూకుమ్మడిగా రాజీనామా చేయలేదు. మరి నిన్నటి వరకూ సరిపోయిన పైలెట్లు ఇవాళ ఎందుకు సరిపోవడం లేదు అంటే.. పైలెట్లు ఉన్నారు కానీ వారిని గరిష్టంగా వాడేసుకున్నారు. టోటల్ ఫ్లైయింగ్ అవర్స్ అన్నింటినీ వాడేసుకున్నారు. ఇప్పుడు నడపడానికి పర్మిషన్ ఉన్న పైలట్లు లేరు. అంటే ఇండిగో ప్రణాళిక లేకుండా వ్యహరించిందని అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదాల నివారణకు పైలట్ల విషయంలో కొత్త నిబంధనలను డీజీసీఏ ఏడాదిన్నర కిందట తెచ్చింది. పైలట్లకు వారానికి 36 నుంచి 48 గంటల రెస్ట్, రాత్రి విమానాల్లో డ్యూటీ గంటలు తగ్గింపు, లీవ్‌ను వీక్లీ రెస్ట్‌గా లెక్కించకుండా నిషేధం వంటివి ఉన్నాయి. ఇది పైలట్ల ఆరోగ్యం , భద్రత కోసం తీసుకొచ్చిన మార్పులు. ఏడాదిన్నర కిందట తెచ్చినా..మెల్లగా పైలట్లను పెంచుకోవాలని ఏడాదిన్నర సమయం ఇచ్చి..నవంబర్ నుంచి అమలు చేస్తోంది.
మిగతా విమానయాన సంస్థలన్నీ తమ అవసరాలకు తగ్గట్లుగా పైలెట్లను పెంచుకున్నాయి.కానీ దేశ డొమెస్టిక్ ఫ్లైట్స్ సర్వీస్‌లో అరవై శాతం వాటా ఉన్న ఇండిగో మాత్రం నిర్ల్కష్యం చేసింది. ఎయిర్ ఇండియా అవసరమైన పైలట్లను ముందుగానే నియమించుకుంది.ఇండిగో మాత్రం నియమించకుండా టైంపాస్ చేసుకుంది. అందుకే అకస్మాత్తుగా పైలట్ల కొరత ఏర్పడింది. 60 శాతం మార్కెట్ షేర్ ఉన్న ఇండిగో 18 నెలల నోటీసు అందుకుని కూడా అదనపు పైలట్లను నియమించు కోకుండా ప్రయాణికులను టార్చర్ పెట్టింది. ఈ సమస్య మరో రెండు నెలల వరకూ ఉండే అవకాశం ఉంది.