మోడీని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతున్న మీడియా..!

కరోనా దెబ్బకు భారతదేశ ప్రింట్ మీడియా మొత్తం సంక్షోభంలో పడింది. ఇప్పటికి రూ. నాలుగున్నర వేల కోట్ల నష్టాలు చూసిన పత్రికా రంగం వచ్చే ఆరు నెలల్లో అవి రూ. పదిహేను వేల కోట్లకు చేరుతాయని భయపడుతోంది. అదే జరిగిదే.. దేశంలో ఉన్న సుప్రసిద్ధి మీడియా సంస్థలన్నీ… లాకౌట్ అయిపోతాయని.. దాదాపుగా 30 లక్షల మంది ఉపాధి కోల్పోతారని…మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే… తమకు బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించాలంటూ.. కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ అధ్యక్షుడు శైలేష్‌ గుప్తా… కేంద్రప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు.

లాక్‌డౌన్ కారణంగా ప్రకటనలు లేవని.. పత్రిక సర్క్యూలేషన్ ఆదాయం కూడా రావడం లేదని.. మార్కెట్ దుస్థితిని తెలియచేసారు. ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ప్రైవేటు రంగం నుంచి ప్రకటనలు కూడా లేవని గుర్తు చేశారు. కరోనా ప్రభావం తర్వాత కూడా ఉంటుందని స్పష్టం కావడంతో.. వచ్చే ఆరేడు నెలల తీవ్ర నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించాలని పత్రికా సమాజం కోరుతోంది. నేరుగా ఆర్థిక సాయం చేయాలని కోరడం లేదు కానీ.. పన్నుల భారం మాత్రం తగ్గించాలని కోరుతోంది. న్యూస్‌ప్రింట్‌పై 5 శాతం కస్టమ్స్‌ సుంకం ఉంది. దీన్ని తీసేయాలని.. అలాగే.. పత్రికా సంస్థలకు రెండేళ్ల పన్ను విరామం ప్రకటించాలని కోరింది. అంతే కాదు.. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల టారిఫ్‌ను యాభై శాతం పెంచాలని కూడా కోరింది. ప్రింట్‌ మీడియా కోసం ఉద్దేశించిన బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని కోరాయి.

లాక్ డౌన్ కారణంగా ఒక్క ప్రింట్ మీడియానే కాదు.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వాటికి ప్యాకేజీలు ప్రకటించే ఆలోచనలు చేస్తోందంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ.. తమ అవకాశాల్ని అందిపుచ్చుకుని సర్వైవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనాపై పోరాటంలో ఆర్థిక వెసులు బాటు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేపర్లలో ప్రకటనలు తగ్గించాలని కోరారు. కానీ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ బడ్జెట్ డబుల్ చేయాలని.. యాడ్ రేట్లు కూడా పెంచాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికర పరిణామం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close