కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టాడా..? ఆమె మాట వినేందుకు కూడా ఇష్టపడటం లేదా..?కేసీఆర్ గారాలపట్టిగా పేరు తెచ్చుకున్న కవితకు తండ్రితో అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది..? తన వారసత్వం కొడుకుకు మాత్రమే చెందాలని దానికి అడ్డుపడే వారెవరనీ దగ్గరికి తీసుకోవద్దని అనుకుంటున్నాడా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
అందరూ అనుకుంటున్నట్టుగా కేటీఆర్ – కవిత మధ్య అభిప్రాయబేధాలు రావడంతోనే కవిత రాసిన లేఖ బయటకు వచ్చిందని అంటున్నా.. కేసీఆర్ సైతం ఆమెను దూరం పెట్టడమే ఇందుకు కారణమని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. కవిత జైలుకు వెళ్లి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కేసీఆర్ కూడా సమర్థించారని, ఇదే కవిత అసంతృప్తికి కారణమైందని, దాంతోనే ఆమె సొంతంగా జాగృతి తరఫున కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చిందని బీఆర్ఎస్ లో జరిగిన చర్చ.
కేసీఆర్ చేసిన ప్రతిపాదనను అంగీకరించి రాజకీయాలకు కొద్ది కాలం దూరంగా ఉన్నప్పటికీ తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు కవిత. ఇదే కవితను కేసీఆర్ దూరం పెట్టేందుకు కారణమైందని, ఆమెకు అపాయింట్ మెంట్ నిరాకరించేందుకు రీజన్ అని వాదనలు వినిపించాయి. కవితపై కేసీఆర్ ఎంత ఆగ్రహంగా ఉన్నా, ఆమెపై అంతే ప్రేమే ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. కానీ , ఆమెకు అపాయింట్ మెంట్ ఇవ్వనంత దూరం పెట్టారంటే..అందుకు కేటీఆర్ ప్రధాన కారణమని కవిత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కవితపై లిక్కర్ స్కామ్ మరకలు ఉండటంతో తన వారసుడిగా కవిత కంటే కేటీఆర్ ను ప్రమోట్ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రయాణంలో కవిత, కేటీఆర్ కు అడ్డంకిగా మారుతుందని తన గారాలపట్టిని కేసీఆర్ దూరం చేసుకున్నారన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో కానీ, జరుగుతూన్న పరిణామాలు మాత్రం అందుకు అద్దం పట్టేలా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.