ఎపిలో పెరుగుతున్న అసహనం

* పార్టీల మధ్య కాల్పుల విరమణ
* చెప్పుకోలేని ఇద్దరు నాయుళ్ళ కష్టం

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ”కాల్పుల విరమణ” కు ఒప్పందం కుదిరింది. రెండు పార్టీల సమన్వయ సమావేశానికి బిజెపి ఎమ్మెల్సీ  వీర్రాజు హాజరుకావడం లేదన్న సమాచారం ముందుగానే తెలిసిపోవడం వల్ల సంధికి ముందే తుపాకీని పక్కన పెట్టేశారని మీడియాకు అర్ధమైంది.

పైకి చెప్పుకోలేక పోయినా కాపురం సజావుగా లేదు…అలాగని విడాకులు ఇచ్చే పరిస్ధితి లేదు. అన్యాయాల్ని, అవమానాల్ని దిగమింగడం తప్ప గత్యంతరం లేని అవస్ధ కేంద్రప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ కు మిగిలింది. అడ్డగోలు విభజన వల్ల రోడ్డున పడిన ఎపి కి తక్షణం కావలసింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు. పరిశ్రమలు మాత్రమే ఉద్యోగాలను సృష్టించగలవు. ప్రభుత్వాలు ఆహ్వానిస్తే పరిశ్రమలు రావు. రాయితీలు ఇస్తేనే వస్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అంటే చట్టబద్ధమైన అనేక రాయితీల ప్యాకేజి. ఇటు వంటి చట్టబద్దమైన పూచీ లేక పోతే రాజకీయనాయకుల మాటలను నమ్మి పరిశ్రమలు  కోట్ల రూపాయల గుమ్మరించడం కష్టం.

నవంబరు 27వ తేదీ లోక్‌సభలో మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ తాను ఆనాడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరింది వాస్తవమేనని అంగీకరించారు. అయితే 14వ ఆర్ధిక సంఘం ఆయా రాష్ట్రాలలో లోటును భర్తీ చేస్తుందని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని ముక్తాయించారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుండి పన్నుల వాటా వచ్చిన తరువాత కూడా వచ్చే ఐదేళ్ళ తర్వాత 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ఆర్ధిక లోటు 2494 కోట్లుగా తేల్చిన విషయం కేంద్ర మంత్రికి తెలియదనుకోలేము. ఎంతో వెనకబడినట్లు భావించబడే బీహార్‌ కూడా 2019-20 ఆర్ధిక సంవత్సరంలో మిగులు బడ్జెట్‌లో వుంటే ఏపీ ఒక్కటే అన్ని రాష్ట్రాల కన్నా అట్టడుగున ఆర్ధిక లోటుతో ఉండే విషయం 14వ ఆర్ధిక సంఘం నిగ్గు తేల్చింది. రాజధాని తెలంగాణాకు పోవడం, పారిశ్రామిక రాబడి ఏమీ లేక పోవడంతో భారీ ఎత్తున ఏపీ ఆదాయం కోల్పోతున్నదని 2014-15 తొలి సంవత్సరం రాష్ట్ర ఆర్ధిక లోటును కేంద్రం పూడ్చాలని ఇప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతోపాటు మంత్రి వెంకయ్యనాయుడు 2014 ఫిబ్రవరి 20వ తేదీ రాజ్యసభలో గట్టిగా వాదించారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ఆమోదం పొందేలోపు వుండే లోటును భర్తీ చేయాలని బల్లగుద్ది మరీ చెప్పారు.

అయితే 2014-15 తొలి సంవత్సరంలో 15691 కోట్ల రూపాయల ఆర్ధిక లోటుగావుందని రాష్ట్ర గవర్నర్‌ 2014 మార్చిలో కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నిధులలో ఇప్పటికే 2300 కోట్లు మాత్రమే వచ్చాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు.

తుపాను వానలకు గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాలు వరి పంట నేలపాలైంది. నిన్న మొన్నటి వరకు కరవు కాటకాలతో, వలసలతో తల్లడిల్లిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. కోరిందే తడవుగా తమిళనాడుకు రూ.950 కోట్లు కేటాయించిన కేంద్రం ఏపీకి వచ్చే సరికి ఇతరత్రా పథకాల క్రింద మంజూరు కావాల్సిన నిధులను వరద నిధులుగా చూపెట్టి రూ.750 కోట్లు విదిల్చింది. మద్రాసుకి వచ్చిన కష్టం పెద్దదే కావచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ కష్టాన్ని పట్టించుకోని వివక్షే దారుణం.

ఈ వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బి జె పి పట్ల అసహనం పెంచుతున్నాయి. ప్రజల్లో వున్న ఈ మూడ్ ని రాజకీయవేత్తలు గమనించారు కాబట్టే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో అయినా చేరిపోడానికి సిద్ధమైపోతున్నారు… తలుపులు బార్లా తెరచివున్నా కూడా బిజెపి వైపు చూడటానకే సాహసించడం లేదు.

ఇలా వుండగా కేంద్రం సహాయనిరాకరణ, వివక్షలపై తెలుగుదేశం పార్టీలో దిగువ స్ధాయినుంచి బహిరంగ విమర్శలు మొదలయ్యాయి. దీనికి ప్రతిగా బిజెపి నుంచి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎదురు దాడులు మొదలయ్యాయి. తెలుగుదేశం బిజెపి సంబంధాల్లో తెగతెంపుల పరిస్ధితి అయితే లేదుగాని పరస్పరం బహిరంగ విమర్శల వల్ల వాతావరణం ముఖ్యంగా తెలుగుదేశానికి చెప్పులో రాయిలాగా, కంటిలో నలుసులాగా వుంది. చంద్రబాబు చొరవతో నిన్న ఆయన నివాసం లో జరిగిన రెండు పార్టీల సమన్వయ సమావేశంలో సమస్యల్ని కూర్చునిపరిష్కరించుకోవాలే తప్ప బహిరంగ విమర్శలకు చేసుకోకూడదు అనే ఒప్పందానికి వచ్చారు.

అంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు…ఆర్ధికంగా ఆంధ్రప్రదేశ్ బాధపడుతున్నా నోరెత్తి అరవలేని నిస్సహాయత చంద్రబాబుది. నరేంద్రమోదీకి నచ్చచెప్పలేని అసహాయత వెంకయ్య నాయుడుది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తామన్న వీళ్ళ వాగ్ధాన భంగాల వల్ల నష్టం మాత్రం రెండు తరాల ఆంధ్రప్రదేశ్ యువతరానిదే!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close