చెన్నైలో మళ్ళీ వర్షం: సహాయక చర్యలకు ఆటంకం

హైదరాబాద్: చెన్నై నగరంలో, తిరువళ్ళూర్, కాంచీపురం, కడలూర్ జిల్లాలలో ఇవాళ మళ్ళీ వర్షం కురుస్తోంది. దీనితో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక బృందాలు నీటమునిగిన ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాయి. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో డొమెస్టిక్ సర్వీసులు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అటు రైల్వే సర్వీసులు కూడా మొదలయ్యాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 450కు చేరింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

దేశం నలు మూలలనుంచీ, ప్రపంచం నలుమూలలనుంచీ తమిళనాడు బాధితులకోసం భారీ స్థాయిలో సహాయక సామాగ్రి వస్తున్నప్పటికీ దానిని బాధితులకు చేరవేయటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఇంకా చాలా ప్రాంతాలు నీటిలో మునిగి ఉండటంతో సహాయక బృందాలు బాధితుల దగ్గరకు వెళ్ళి సహాయక సామాగ్రిని అందించలేకపోతున్నాయి. మరోవైపు బయటనుంచి వస్తున్న వాలంటీర్లకు సహాయాన్ని ఎక్కడకెళ్ళి అందించాలో సూచించేవారు కనబడటంలేదు. ఒక నోడల్ ఏజెన్సీ ఏదీ లేకపోవటంతో సహాయక కార్యక్రమాలమధ్య సమన్వయం లేకుండా పోయింది. దీనితో సహాయక సామాగ్రి పంపిణీని రాజకీయనేతలు హైజాక్ చేసి తమ వర్గాలవారికి, తమ ఇష్టమొచ్చినవారికి చేరవేయటం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వంద టన్నుల సహాయక సామాగ్రి తీసుకుని ఇండియన్ నేవీకి చెందిన రెండు నౌకలు, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇవాళ విశాఖపట్నంనుంచి చెన్నై చేరుకున్నాయి. ఈ సామాగ్రిలో 7 లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.

ఇక నీట మునిగిన ప్రాంతాల వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రేషన్ కార్డులు, సర్టిఫికెట్ల వంటి ముఖ్యమైన పత్రాలు, విలువైన వస్తువులు, బట్టలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇంకా నీళ్ళలోనే మునిగి ఉన్న తమ ఇంట్లోనుంచి తమ రేషన్ కార్డ్, కూతురు సర్టిఫికెట్లను తీసుకురావటానికి వెళ్ళి ఆ నీళ్ళలోనే మునిగి చనిపోయాడు. ఈ సంఘటన చెన్నై నగరవాసులను మరింత కలచివేసింది. దీనిపై ప్రభుత్వాధికారులు, చెన్నై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ, పోయిన సర్టిఫికెట్లకు బదులుగా కొత్తవి ఇస్తామని, వాటిగురించి ఆందోళన చెందొద్దని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close