రఘురామ కృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ ను గుంటూరు కోర్టు కొట్టి వేసింది. ఆయనకు చాలా కాలం నోటీసులు జారీ చేస్తున్నా విచారణకు రావడం లేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఏపీకి రాకుండా బీహార్ లోనే విధులు నిర్వహిస్తున్నారు.
సునీల్ నాయక్ బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటేషన్ మీద పనిచేశారు. ఆ సమయంలో ఆయన సీఐడీ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. రఘురామ కృష్ణరాజు ని అరెస్టు చేసిన సమయంలో , సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు విచారణ జరిపిన అధికారుల బృందంలో ఈయన కూడా ఒకరు.
రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సునీల్ నాయక్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన గుంటూరు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీలో ఉన్న వ్యక్తిని శారీరకంగా హింసించడం అనే ఆరోపణలు తీవ్రమైనవని కోర్టు అభిప్రాయపడింది.
వైసీపీ ఓడిపోయాక సునీల్ నాయక్ బీహార్‌లో విధుల్లో చేశారు. ఏపీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను విచారణకు పిలిచే లేదా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో ఏ1గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు, ఏ2గా ఉన్న పి.వి. సునీల్ కుమార్, ఏ3గా ఉన్న పి. సీతారామాంజనేయులు కూడా ఉన్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల నిమిత్తం బీహార్ ప్రభుత్వానికి లేదా కేంద్ర హోం శాఖకు లేఖ రాసే అవకాశం ఉంది.
