పూరి ని కమ్మిన మబ్బు చార్మి ?

దర్శకుడు పూరి జగన్నాధ్, నటి చార్మికౌర్ ఎప్పుడూ కలిసే కనిపిస్తారు. నిర్మాణాలు కూడా కలిసే సాగిస్తున్నారు. వాళ్ల వ్యవహారాలు వాళ్లవి. మిగిలిన వాళ్లకు అనవసరం. అయితే బోల్డ్ గా మాట్లాడడానికి, బోల్డ్ నెస్ కు పెట్టింది పేరు అయిన నటి హేమ ఓ ఇంటర్వూలు ఈ విషయమై కామెంట్ చేసినట్లు యూ ట్యూబ్ లో ఫ్రోమో హల్ చల్ చేస్తోంది.
పూరితో పరిచయం వుందా? చార్మితో పరిచయం వుందా? అని అడిగితే, పూరి జగన్నాధ్ అనే సూర్యుడిని కొన్ని మబ్బులు కమ్మి వున్నాయి. ఎప్పటికయినా ఆ మబ్బులు పక్కకు తొలగిపోయి, పూరి బయటకు వస్తారనే నమ్మకం తనకు వుందని హేమ సమాధానం ఇచ్చింది.
ఇంతకీ ఆ మబ్బులు ఎవరు? అని అడిగితే, ఏమో? మీరు అడిగినవారేనేమో? అని గడుసుగా సమాధానం ఇచ్చింది.  ఇదిలా వుంటే, ఇదే ఇంటర్వూలో త్రివిక్రమ్ మీద కూడా చిన్న చణుకు వేసింది హేమ. తన రెమ్యూనిరేషన్ విషయంలో ఆయన కలుగచేసుకోవడంతో ఆయనతో మాట్లాడడం మానేసానని చెప్పింది. నిర్మాతలు, మేనేజర్లు చూడాల్సిన విషయాన్ని త్రివిక్రమ్ చూడడం ఏమిటని, తనకు ఈ విషయంలో చాలా మండిందని, కడుపు మండి మాట్లాడడం మానేసానని వెల్లడించిది.
Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com