దసరా టార్గెట్ గానే ‘సైరా’

మెగాస్టార్ చిరంజీవి మెగామూవీ ‘సైరా’ ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేదాని మీద కొన్ని సందేహాలు జనాల్లో వున్నాయి. దసరాకు అని కొందరు, కాదు సంక్రాంతికే అని కొందరు అనుకోవడం కామన్. నిర్మాత రామ్ చరణ్ కూడా విడుదల మీద పూర్తి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దసరాకు రావాలనుకుంటున్నాం అనే టైపులోనే చెబుతూ వస్తున్నారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం సైరా సినిమా దసరా టార్గెట్ గానే రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికి ఇంకో యాభై వర్కింగ్ డేస్ వరకు షూట్ బకాయి వుందని తెలుస్తోంది. అయితే ఒక లొకేషన్ అని కాకుండా మల్టిపుల్ లోకేషన్లలో షూట్ బకాయి వుంది. వీటిలో రాజస్థాన్ లోని కోటలు కొన్ని వున్నాయి. అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో కూడా షూట్ బకాయి వుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో భారీ పాట చిత్రీకరణ జరుగుతోంది.
ఎలా లేదన్నా, మార్చి చివరకు లేదా ఏప్రియల్ నెలాఖరు లోపు టొటల్ షూట్ వర్క్  పూర్తయిపోతుందని యూనిట్ వర్గాల బోగట్టా. దసరా కు విడుదల అనుకున్నా అక్కడికి ఇంకా ఆరునెలలు టైమ్ వుంటుంది. సి జి వర్క్ కు, పోస్ట్ ప్రొడక్షన్ కు ఇది సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. ఆగస్టులో సాహో విడుదల అయిపోతే, దసరాకు సైరా రావడానికి ఇక ఏ ఒక్క అడ్డంకి కూడా లేదు. మరే పెద్ద హీరో సినిమా కానీ, మిడిల్ రేంజ్ హీరో సినిమాలు కానీ దసరా కు వుండకపోవచ్చు. పైగా సైరా వస్తోంది అంటే ఒకవేళ రావాలనుకున్నవి కూడా దారిచ్చేస్తాయి.
ఇదిలా వుంటే సైరా దసరాకు రావడమే తమకు మంచిదనే ఆలోచనలో బన్నీ-త్రివిక్రమ్ సినిమా యూనిట్ వుంది. ప్రశాంతంగా సంక్రాంతి టార్గెట్ గా తమ సినిమాను రెడీ చేసుకోవచ్చని వాళ్ల ఆలోచన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close