లోక్‌సభకు కేసీఆర్ పోటీ ఖాయమేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పక్కా రాజకీయ వ్యూహంతో ఉంటారు. అది అసెంబ్లీ అయినా… పార్లమెంట్ అయినా సరే. కుమారుడికి… సీఎం పీఠం అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. దానికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికే సగం పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించారు. ఇక పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటి… తాను ఢిల్లీలో చక్రం తిప్పడమే మిగిలింది. అందుకే… పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయ పరిణామాలు చూస్తూంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కానీ.. కూటమికి కానీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదనేది.. అందరూ అంచనా వేస్తున్న విషయం. కేసీఆర్ కూడా అదే భావనలో ఉన్నారు. తను సాధించే పదహారు సీట్లే కీలకం అవుతాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పార్లమెంట్‌కు పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

కేసీఆర్ పార్లమెంట్‌కు పోటీ చేస్తే.. ప్రజల్లో ఓ ఊపు వస్తుందని.. అది అన్ని సీట్లలోనూ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. పైగా.. వచ్చే ఎన్నికల్లో మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. ఓటర్ల ప్రాధాన్యతలు మారిపోతాయి. అది టీఆర్ఎస్‌కు మైనస్ అవుతుంది. అలా కాకుండా.. కేసీఆర్ కూడా.. రంగంలో ఉన్న భావన వస్తే.. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా.. కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. నిజానికి పార్లమెంట్ అభ్యర్థులపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వాటిలో తన పేరు కూడా ఉందంటున్నారు. కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయవచ్చని చెబుతున్నారు.

కేసీఆర్ కరీంనగర్ నుంచి గతంలో మూడు సార్లు గెలిచారు. కానీ.. ఆ మూడు ఒకే టర్మ్‌లో వచ్చాయి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి, 2014లో మెదక్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో అసెంబ్లీకి కూడా పోటీ చేసి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మెదక్ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కరీంనగర్‌ సిట్టింగ్ ఎంపీగా వినోద్‌కుమార్‌ ఉన్నారు. ఆయనకు మరో చోట సర్దుబాటు చేయడమో.. రాజ్యసభ సీటు ఇవ్వడమో చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఎంపీ స్థానంలో కేసీఆర్ పోటీ మాత్రం.. ఖాయమేనన్నట్లుగా టీఆర్ఎస్‌లో ధీమా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close