ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థ మారిందా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ – ఎస్‌.జె. సూర్య కాంబోలో ఓ సినిమా కొబ్బ‌రికాయ్ కొట్టుకొని ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు నుంచి సూర్య త‌ప్పుకోవ‌డం డాలీ (గోపాల గోపాల ఫేమ్‌) వ‌చ్చేయ‌డం తెలిసిన విష‌య‌మే. ఇప్పుడుప‌వ‌న్ సినిమాకి సంబంధించిన స‌రికొత్త అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాకి ద‌ర్శ‌కుడే కాదు, క‌థ కూడా మారిపోయింద‌ట‌. ఎస్‌.జె. సూర్య‌తో సినిమాకి సంబంధించి స్క్రిప్టు ప‌నుల‌న్నీ పూర్త‌యిన పిద‌ప‌.. ఆయ‌న ఈ ప్రాజెక్టు లోంచి డ్రాప్ అయ్యారు. సూర్య వెళ్లిపోయినా.. క‌థ మార‌దులే అనుకొన్నారంతా. అయితే.. డాలీ రావ‌డంతో క‌థ‌లో మార్పులు చోటు చేసుకొనే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

గోపాల గోపాల స‌మ‌యంలోనే డాలీతో ఓ సినిమా చేయ‌బోతున్నా అని ప్ర‌క‌టించాడు ప‌వ‌న్‌. దానికి గ‌ల కార‌ణం.. అప్ప‌టికే డాలీ.. ప‌వ‌న్‌కి ఓ క‌థ చెప్పి ఓకే అనిపించుకోవ‌డ‌మే. డాలీ ద‌గ్గ‌ర ప‌వ‌న్‌కి స‌రిప‌డ క‌థ ఒక‌టుంది. సూర్య డ్రాప్ అవ్వ‌డంతో ప‌వ‌న్‌కి డాలీ గుర్తొచ్చింది అందుకే. సూర్య రెడీ చేసిన స్క్రిప్టును మొత్తంగా ప‌క్క‌న పెట్టి డాలీ క‌థ‌తోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దామ‌నుకొంటున్నాడు ప‌వ‌న్‌. అయితే డాలీ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్దం చేయ‌డానికి ఎంత టైమ్ ప‌డుతుందో తెలియ‌డం లేదు. ఒక‌వేళ స్క్రిప్టు రెడీగా ఉంటే గ‌నుక‌… క‌థ కూడా మారిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close