బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే… బాల‌య్య సినిమా అంటే హీరోయిన్ల ద‌గ్గ‌రే స‌మ‌స్య వ‌స్తుంది. ఆయ‌న ఏజ్‌కీ, క్రేజ్‌కీ, సీరియారిటీకి స‌రిప‌డా హీరోయిన్ ని వెదికి ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. ప్ర‌తీ సినిమాకీ ద‌ర్శ‌కుల‌కు ఈ స‌మ‌స్య త‌ప్ప‌కుండా ఎదుర‌వుతుంది. ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా. బాల‌య్య – అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార‌మే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంచుకోవాలో తెలీక అనిల్ రావిపూడి స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. చాలామంది హీరోయిన్ల‌ని సంప్ర‌దించాడు. బాలీవుడ్ కీ వెళ్లొచ్చాడు. కానీ కుద‌ర్లేదు. ఎట్ట‌కేల‌కు… బాల‌య్య ప‌క్క‌న హీరోయిన్ దాదాపుగా ఫిక్స‌యిన‌ట్టే తెలుస్తోంది. ప్రియాంక జువాల్క‌ర్ పేరుని బాల‌య్య సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. ఇటీవ‌ల‌… ఓ ఫొటో షూట్ కూడా నిర్వ‌హించాడు అనిల్ రావిపూడి. దాంతో.. దాదాపుగా ప్రియాంక ఖాయ‌మ‌న్న టాక్ వినిప‌స్తోంది. అయితే.. ప్రియాంక మెయిన్ హీరోయినా? లేదంటే మ‌రో క‌థానాయిక ఉంటుందా అనేది తెలియాలి. ఎందుకంటే.. ప్రియాంక ఇప్ప‌టి వ‌ర‌కూ టాప్ హీరోల‌తో చేయ‌లేదు. చేసిన అర‌కొర సినిమాల్లో ఆమెకు అంత‌గా గుర్తింపు రాలేదు. త‌నే మెయిన్ హీరోయిన్ అయితే.. బాల‌య్య అభిమానులు నిరాశ ప‌డ‌డం ఖాయం. మ‌రి అనిల్ రావిపూడి మైండ్ లో ఏముందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close