పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మపై లెక్కలేన్ని కుట్రలు చేస్తున్నారు. పిఠాపురంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. దాంతో ఎవరైనా తమ పార్టీలోకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. వర్మ.. మానవత్వంతో చేసే చిన్న చిన్న పనుల్ని అడ్డం పెట్టుకుని.. తమ పార్టీలోకి వచ్చేస్తున్నారని ప్రచారం చేసుకునేందుకు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన మంచానికే పరిమితమైన ముద్రగడ పద్మనాభంను వర్మ పరామర్శించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నేతగా ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వైసీపీలో చేరాలంటే.. పూర్తిగా రాజకీయాలకు దూరమైన ముద్రగడను వర్మ ఎందుకు కలుస్తారు ?. సజ్జలనో.. జగన్ రెడ్డినో కలవలేరా ? . ప్రచారం చేసే వాళ్లు ఈ చిన్న లాజిక్ ను మిస్సయ్యారు.
వర్మ గురించి తెలియని వాళ్లే ఇలాంటి ప్రచారాలు చేస్తారు. పవన్ కోసం ఆయన సీటును త్యాగం చేశారు. ఆ త్యాగానికి తగ్గ గౌరవాన్ని పొందుతారని కూడా ఆయనకు తెలుసు. మధ్యలో ఆయనపై అనవసరపు ప్రచారాలు చేసి.. ఆయన ఏదోవైసీపీలో చేరుతారని ప్రచారం చేసుకోవడం తాత్కలిక ఆనందాన్నిస్తుంది కానీ.. వైసీపీ దుస్థితిని అందరి ముందు పెడుతుంది.
గోదావరి జిల్లాలలో టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత కాలం .. వైసీపీకి ఒక్క సీటు అయినా వస్తుందని.. ఒక్కరంటేఒక్కరు కూడా నమ్మరు. అలాంటి పార్టీలో చేరాలని కూడా ఎవరూ అనుకోరు. ఆ మాత్రం క్లారిటీ నేతలందరికీ ఉంది. చాన్స్ వస్తే.. కూటమి పార్టీల్లో చేరేందుకు వైసీపీ నేతలంతా రెడీగా ఉన్నారన్న గుసగుసలు మొదటి నుంచీ ఉన్నాయి.