భారతీకృష్ణ ‘విరాగాలు’ 2 : ‘పచ్చ’పైరు మేత

‘పచ్చ’ పైరు మేత కొరకు రెచ్చి ఉరుకు అశ్వానికి
మాటలతో కళ్లెమేస్తె కలకాలం ఆగేనా!
అధికారపు అంచునుంచి తాయిలాలు వెల్లువెత్త
వీరి బ్రేకు పటిమ ధాటికి జారిపోకుండా మిగులునా?

జెండా దించేసినాడు.. కాడి పక్కనేసినాడు..
పనిచేస్తుందా ఇంకా… బుజ్జగింపు పర్వం !
రాజకీయ యవనికపై పవరు కుర్చీకే పెద్దపీట
దాని చుట్టూతానే.. జగతి తిరుగుతోంది సర్వం!!

తెలుగుదేశం పార్టీలో చేరిపోవడానికి సకలం సిద్ధం చేసుకున్న భూమా నాగిరెడ్డికి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రస్తుతానికి బ్రేకులు వేసినట్లే కనిపిస్తున్నప్పటికీ.. అలా ఎంతకాలం ఆయనను ఆపి ఉంచగలరనే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటువైపు తెలుగుదేశం పార్టీలో కూడా అదే భూమా ను లోకల్‌ లీడర్స్‌ ఒక పట్టాన ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు.

అయినా వైఎస్‌ జగన్‌ కాంగ్రెసును వీడి సొంత కుంపటి పెట్టుకున్నా, తనకు నచ్చిన వారినందరినీ వెంట జత చేర్చుకున్నా.. అందరూ అధికారం మీద ఆశతోనే పావులు కదిపారన్న మాట వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో వర్తమానం మాత్రమే నిజం అనుకుంటూ.. అధికారం ఉన్న నీడకు చేరుకోవాలని భూమా ఆశ పడడంలో వింతేముందని అనుకుంటున్నారు జనం.
– భారతీకృష్ణ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆగస్టు 15కి అయినా “డి-పట్టాలు” మాత్రమే జగన్ ఇవ్వగలరా..?

ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తున్నాం. ఐదేళ్ల తర్వాత అమ్మేసుకోవచ్చంటూ.. ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాల లబ్దిదారులను ఊరిస్తున్నారు. అయితే.. అలాంటి అవకాశం లేదని.. చట్టంలో అలాంటి వెసులుబాటు లేదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు....

ఐనవోలు నుంచి విజయవాడకు అంబేద్కర్ స్మృతివనం..!

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో గత ప్రభుత్వం దాదాపు వంద ఎకరాల్లో నిర్మించాలనుకున్న అంబేద్కర్ స్మృతి వనం పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు.. విజయవాడ స్వరాజ్ మైదానంలో కట్టాలని నిర్ణయించుకుంది. స్వరాజ్ మైదానం...

రెండు నెలల తర్వాత ఎల్జీ అరెస్టులు..!

ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఘటన జరిగినప్పటి నుండి.. ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంత భారీ ప్రమాదానికి కారణమైన వారిపై.. అపరిమితమైన అభిమానం చూపుతున్నారని.. చర్యలు...

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

HOT NEWS

[X] Close
[X] Close