మహేష్ సినిమా ఆమె కన్ఫాం అయ్యిందా..!

సూపర్ స్టార్ మహేష్ సినిమాలో హీరోయిన్ అంటే అది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.. ఇలియానా, సమంత లాంటి భామలు మహేష్ సినిమాలతోనే లైం లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం అలాంటి లక్కీ ఆఫరే మలయాళ భామ కొట్టేసిందని తెలుస్తుంది. మలయాళంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాధించిన బ్యూటీ కీర్తి సురేష్. నేను శైలజ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ అమ్మడు రెండో అవకాశంగా మహేష్ సినిమాలో ఓకే అయ్యిందట.

మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత చేస్తున్న మురుగదాస్ సినిమాకు ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ దాదాపు కన్ఫాం అయినట్టే అని సమాచారం. ఇక మిగతా హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్ర యూనిట్. సోషల్ మెసేజ్ తో కూడిన కథతో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ నుండి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం, మురుగదాస్ అకిరా సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

పారాస్ జైన్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు మహేష్. మరి తెలుగులో సెకండ్ చాన్స్ మహేష్ సినిమా అవకాసమ దక్కించుకున్న కీర్తి స్టార్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]