వైసీపీకి రాజకీయాలు చేయడం చేత కావడం లేదో లేకపోతే సలహాదారులు ఎత్తిపోయారో కానీ జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ స్కాములేనని ప్రచారం చేస్తున్నారు. అయితే అవి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలని ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ప్రజలకు నిజాలు చెప్పినా తెలుసుకోలేని అనుకుంటారో.. వారు మోసం చేయడానికి, మోసపోవడానికి రెడీగా ఉంటారని అనుకుంటారో కానీ ఇలాంటి ప్రచారాలు చేయడానికి ఏ మాత్రం సిగ్గపడరు.
గతంలో జగన్ రెడ్డి పెట్టి పోయిన బకాయిల కోసం వైసీపీ పోరుబాట ప్రకటించినట్లే.. ఇప్పుడు జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలు స్కాములు అంటూ ప్రచారం ప్రారంభించారు. యాక్సిస్ అనే సంస్థతో జగన్ రెడ్డి సర్కార్ గతంలో ఒప్పందం చేసుకుంది. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ లో చాలా ఎక్కువ రేటుకు కొనుగోలుకు అంగీకారం తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆ సంస్థ ఒప్పందాన్ని సమీక్షించింది. యాక్సిస్ సంస్థను పిలిచి మాట్లాడింది. ఈ క్రమంలో రేటును దాదాపుగా రూపాయి వరకూ తగ్గించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందాన్ని సాక్షి, వైసీపీ మీడియా తప్పుడు ప్రచారానికి వాడుకుంటోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒప్పందం చేసుకుందని ప్రచారం చేయడం ప్రారంభించింది. కానీ అలా ప్రచారం చేస్తే తాము గతంలో చేసిన నిర్వాకం అంతా బయటకు వస్తుందని గుర్తించలేకపోయింది. ఇప్పుడు అదే జరుగుతోంది. యాక్సిస్ విద్యుత్ ఒప్పందంపై అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల్లో చర్చకు కారణం అవుతోంది. జగన్ రెడ్డి .. చేసిన నిర్వాకాల కారణంగా ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేస్తే పెట్టుబడుల విశ్వాసం దెబ్బతింటుందని ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరిస్తోంది. అయితే స్కాములు చేసిన జగన్ రెడ్డి మాత్రం ఎగిరెగిరి పడుతున్నారు. వాటిలో విచారణలు చేయిస్తే.. మొదట నిందితుడిగా మారేది జగన్ రెడ్డే.