ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని.. జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని తట్టుకుని, సరిదిద్ది గాడిన పెడుతున్నామని చంద్రబాబు లెక్కలు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయిన సందర్భంగా గతంలో జరిగిన విధ్వంసం.. ఇప్పుడు జరుగుతున్న వికాసం పై గణాంకాలను విడుదల చేశారు. దేశ సగటు కన్నా జీఎస్డీపీ ఎక్కువగా ఉంది.దీంతో వైసీపీ నేతలకు కాలిపోయింది. ఏపీ బాగుపడటం ఏమిటి…అని సందేహపడ్డారు. అలా జరగకూడదని మీడియా ముందు తాము రాసిన లెక్కలేసుకుని వచ్చారు.
జగన్ రెడ్డి ఆర్థిక సలహాదారుడు ఎవరో !
జగన్ రెడ్డి ఈ మధ్య ప్రతి నెలా ఓ ఆర్థిక పత్రం విడుదల చేస్తున్నారు. ఇంగ్లిష్ లో ఆర్థిక శాస్త్రవేత్తలు, ఫైనాన్షియల్ నిపుణులకు కూడా అర్థం కాని భాషలో అవి ఉంటున్నాయి. అంతిమంగా ఆయన చెప్పేది ఏమిటంటే ఏపీ బాగుపడటం లేదని. ఏపీ అభివృద్ధి చెందడం లేదని చెప్పడానికి ఆయన ప్రయాస పడుతున్నారు. ఆదాయం పెరగడం లేదంటారు. పెరిగిన ఆదాయం లెక్కలు చెప్పరు.కేవలం పర్సంటేజీ చెబుతారు. ఇలాంటి జిమ్మిక్కులతో ఆయన లెక్కలు ఉంటాయి. తాజాగా చంద్రబాబు ప్రకటించిన జీఎస్డీపీ లెక్కలపైనా ఎవరికీ అర్థం కాని వ్యాసాన్ని ఆయన ఇంగ్లిష్ లో అందించారు.
జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల లోటు
2014 -19 సీఎంగా ఉన్న చంద్రబాబు కొత్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని లోటు పెరగకుండా.. ఆదాయం పెంచేలా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అన్ని రంగాలను సంస్కరించి.. ప్రజలపై భారం పడకుండా చూస్తూ వచ్చారు. కానీ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వచ్చిన జగన్ రెడ్డి వాటిని అమలు చేయడానికి ప్రజల్ని , ప్రజా ఆస్తుల్ని తాకట్టు పెట్టడం,అమ్మడం ప్రారంభించారు. అప్పుల వెల్లువ సృష్టించారు. ఆయన హయాంలో ఆర్థిక లోటు, రెవిన్యూ లోటు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఎన్నో సార్లు ఆర్బీఐ హెచ్చరించింది. అప్పుల వాళ్లు వచ్చి పీకల మీద కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘోరమైన పాలన ప్రభావం అప్పుడే పోతుందా ?
ఏపీలో ఉద్యోగ, ఉపాధి విప్లవం – కళ్ల ముందే అన్నీ
ఏపీలో ఆర్థిక వ్యవహారాలు పెరిగాయి. డబ్బులు ఖర్చు పెట్టేవారు పెరిగారు. అమరావతి, పోలవరం, ప్రాజెక్టులు,రోడ్ల పనులు ఇలా ప్రభుత్వం భారీగా పెట్టుబడి వ్యయానికి ఖర్చు పెడుతోంది. అలాగే ప్రజలకు పథకాలు అమలు చేస్తోంది. వారి వద్దా నగదు ఉంటోంది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. కొత్త కంపెనీలతో ఉద్యోగాలు వస్తున్నాయి. వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో నిస్సారంగా ఉన్నఏపీ ఇప్పుడు దూసుకెళ్తోంది. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే జగన్ రెడ్డి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఏపీ బాగుపడుతూంటే.. బాధపడిపోతున్నారు.
