తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రత, నెయ్యి కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఫేక్ అని తేలిపోయిన ఆరోపణలతో తాజాగా ట్వీట్ చేస్తున్నారు. లడ్డూ వివాదంలో కీలక ఆధారాలు, ల్యాబ్ రిపోర్టులు బయటపడి, సిట్ విచారణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు స్పష్టమవుతున్నా, వాటన్నింటి డైవర్ట్ చేసేందుకు ఫేక్ గేమ్ ఆడుతున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారమైన టీటీడీ చైర్మన్ పై టీడీపీ ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్న లేఖ, వీడియోలు ఫేక్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా, వాటినే ఆధారం చేసుకుని ట్వీట్లు వేస్తున్నారు. గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను గాలికి వదిలేసి, అన్యమత ప్రచారాలకు, రాజకీయ పునరావాస కేంద్రాలకు వేదికగా మార్చిన చరిత్రను మరుగున పరిచేందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు. ఇక నెయ్యి కొనుగోలు ధరలు మరియు హెరిటేజ్ సంస్థపై చేస్తున్న ఆరోపణలకు తాడూబొంగరం లేదు. అయినా దాన్నే పట్టుకుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన నెయ్యి కోసం మార్కెట్ ధరకు అనుగుణంగా టెండర్లు పిలిస్తే, దాన్ని కూడా స్కామ్ అని చిత్రించడం జగన్ బ్రాండ్ రాజకీయంగా కనిపిస్తోంది. వాస్తవాలను అంగీకరించే ధైర్యం లేక, ఫేక్ వీడియోలనే సాక్ష్యాలుగా చూపిస్తూ జగన్ చేస్తున్న పోరాటం దేశ ప్రజల ముందు ఆయన రాజకీయాన్ని మరింత కిందకు దిగజారేలా చేస్తోంది.


