తన హయాంలో GVA అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ లో నెంబర్ వన్ గా ఏపీ నిలిస్తే ఇప్పుడు పడిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఓ గ్రాఫ్ పోస్టు చేసి ట్వీట్ చేశారు.కానీ ఆర్బీఐ నివేదిక మొత్తాన్ని పరిశీలిస్తే ఆయన ఈ ట్వీట్ చేయరు. ఆయన చేసిన ట్వీట్‌ను చూసి ఆ నివేదికను ఇతరులు చూస్తారు. అప్పుడు పరువు పోతుందని ఆయన అనుకోరు. ఎందుకంటే ఆయనకు ఈ స్టఫ్ ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరో కానీ పూర్తి వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లరు.
అసలు ఆర్బీఐ నివేదికలో ఏముందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజా గణాంకాల విశ్లేషణ ప్రకారం, 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GVA) కొంత స్తబ్దతకు లోనైనప్పటికీ, ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మళ్లీ వేగవంతమైన వృద్ధి పథంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా పారిశ్రామిక , సేవా రంగాల్లో వస్తున్న మార్పులు రాష్ట్ర ఆదాయానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి.
2019-24 మధ్య కాలాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర సగటు వృద్ధి రేటు సుమారు 10.32 శాతంగా నమోదైంది. అంతకుముందు ఐదేళ్ల కాలంలో అంటే చంద్రబాబు హయాంలో (2014-19) ఉన్న 13.49 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ కాలంలో కోవిడ్-19 ప్రభావం ఒక కారణమైనప్పటికీ, పారిశ్రామిక పెట్టుబడులు తగ్గడం , మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కూడా వృద్ధి రేటు తగ్గడానికి కారణమయ్యాయి. ఫలితంగా రాష్ట్ర రుణ భారం కూడా పెరిగి, డెట్-టు-GSDP రేషియో 32.5 శాతానికి చేరుకుంది.ఇది పాలనా వైఫల్యం.
అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.28 శాతం వృద్ధి రేటును నమోదు చేసి జాతీయ సగటు 8.7 శాతం కంటే ముందు వరుసలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంలో వృద్ధి రేటు 10.2 శాతంగా ఉండేది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి, తయారీ రంగాల్లో వృద్ధి 12.2 శాతానికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామిక , సేవా రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం సుమారు 2,68,653 రూపాయలకు చేరుకుంటుందని అంచనా . ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కొత్త పెట్టుబడుల ఆకర్షణ రాష్ట్ర GVA వృద్ధిని మరింత పెంచే అవకాశం ఉంది.
తన పాలనలో జరిగినదంతా విధ్వంసమే. అదేదో గోప్యంగా జరిగింది కాదు.. అందరి కళ్ల ముందే జరిగింది. అయినా ఏవో నివేదికలు గ్రాఫ్‌లు పట్టుకుని వచ్చి తనకు తెలియని సబ్జెక్ట్ మీద జగన్ ట్వీట్లు వేస్తే.. ఆయనను నమ్ముతారా?. నిజం తెలుసుకోకుండా ఉంటారా?
