ఏపీ కేబినెట్‌లో లీకు వీరుడి కోసం జగన్ వేట..!

మీడియాపై ఆంక్షలు.. కేసులు పెట్టేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వివాదాస్పద జీవో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. అయితే.. దీనికి సంబంధించిన వివరాలు చాలా గోప్యం. కేబినెట్‌ నోట్‌ కూడా గోప్యమే. కానీ.. కేబినెట్ భేటీ పూర్తి కాగానే ఈ కేబినెట్ నోట్‌ బయటకు లీక్‌ అయ్యింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. నిరాధారమైన వార్తలు రాస్తే అటువంటి పత్రికలు, ప్రసార సాధనలపై కేసులు పెట్టే అధికారాన్ని సంబంధిత ప్రభుత్వశాఖ కార్యదర్శికి అప్పగించాలనీ ఆ క్యాబినెట్ నోట్‌లో పేర్కొన్నారు. నిజానికి దానిపై నిర్ణయం తీసుకోలేదు.

2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇలాంటి జీవోనే తీసుకురాగా, అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ఆ జీవోని ఉపసంహరించుకున్నారు. తనకు తెలియకుండానే వచ్చిందని వైఎస్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు.. ఆ కేబినెట్ నోట్‌ కూడా అదే విధంగా ఉండటంతో.. జగన్ కు ఇబ్బందికరంగా మారింది. అసలు ఎలా బయటకు వెళ్లిందనే దానిపై ఆరా తీయమని.. ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఎవరికివారు తమకు తెలియదని చెబుతున్నప్పటికీ.. నలుగురైదుగురిపై అనుమానం పెంచుకుని వారిపై నిఘా ఉంచారు. ఈ క్యాబినెట్ నోట్ లీక్ కావటంతో జాతీయ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగిందని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

సోషల్ మీడియాలో సైతం ఈ నోట్‌పై చాలా రచ్చే జరిగింది. అందుకే.. కుట్ర పూరితంగానే.. ఈ నోట్‌ను లీక్ చేశారని.. ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఆ లీకు వీరుడ్ని పట్టుకుని తీరాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇలా ఇంకెన్ని లీకులు ఉంటాయోనన్న ఆందోళన కూడా ప్రభుత్వ పెద్దల్లో ఏర్పడింది. అందుకే… సీరియస్ యాక్షన్ తీసుకుంటే.. ఇంకో సారి అలాంటి పనులు చేయడానికి ఎవరూ సిద్ధపడరని భావిస్తున్నారు. అయితే.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు..మరి జగన్ సర్కార్ లీకు వీరుడ్ని పట్టుకుంటుందో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close