ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం ఎక్కడ బాగుపడిపోతుందో అని జగన్ రెడ్డి బాధపడిపోతున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూంటే అమ్మేస్తున్నారని అబద్దపు ప్రచారం చేస్తూ కొన్న వాళ్లను జైల్లో పెడతామని కూడా ప్రకటించారు. కోటి సంతకాలంటూ ఓ పది లారీల నిండా పెట్టేలు పెట్టి ఊరూరా తిప్పుతున్నారు. ఇప్పుడు అవి లోక్ భవన్ కు పంపుతున్నామని జెండా ఊపారు. అవి తిరిగి తిరిగి మళ్లీ తాడేపల్లికే వస్తాయి. వాటిని తీసుకుని గవర్నర్ ఏం చేసుకుంటారు. ఓ వినతి పత్రం ఇస్తే తీసుకుంటారు కానీ.
ఆ కోటి సంతకాలను ఏం చేయాలో జగన్ రెడ్డికీ తెలియడం లేదు. వాటిలో అట్టపెట్టేలు విప్పదీస్తే అసలు సంతకాల గుట్టు బయటపడుతుంది. అందుకే అవి కాన్ఫిడెన్షియల్ గా దాచి పెట్టుకుంటారు. వాటిని ఏం చేస్తారంటే రేపు కోర్టుకు కూడా వెళ్తారట. కోర్టులో ఆ ట్రక్కుల సంతకాలను సమర్పిస్తానని అంటున్నారు. అసలు ఆ సంతకాలు ఎలా ఉపయోగపడతాయో ఆయనకే తెలియాలి. ఎలాగూ ఆ సంతకాలకు విలువ ఉండదని తెలుసు..అయినా వాటినేదో చూపించి రాజకీయం చేస్తున్నారు.
పీపీపీ పాలసీ విజయవంతమైనదిగా గుర్తింపు పొందింది. కేంద్రం కూడా అదే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అయినా పీపీపీ అంటే ప్రైవేటు అని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. మెడికల్ కాలేజీల నిర్వహణలో భాగస్వామ్యం అవ్వాలని అనుకుని వచ్చే వారిని జైల్లో పెడతాం అని బెదిరిస్తున్నారు. ఆయన పెట్టుబడిదారుల్ని బెదిరిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ఆయన ముప్పు ఉండదని ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వం తంటాలు పడుతూంటే ఆయన మాత్రం.. తాను వెంటాడతానని అంటున్నారు. ఏపీపై ఇంత పగ ఎందుకో?
