చైతన్య : హైదరాబాద్‌ను ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్, జగన్..!

హైదరాబాద్ ఆర్థిక వృద్ధి అంచనాలకు అందని విధంగా ఉంటోంది. నాలుగైదేళ్లలోనే… భూముల క్రయవిక్రయాలు.. రెట్టింపు.. రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా.. గత నాలుగు నెలల కాలంలో.. ఈ వృద్ధిని పట్టలేకుండా ఉన్నారు. ఓ వైపు అమరావతిని.. జగన్ సర్కార్ పడుకోబెట్టేసి… లేని అవినీతిని ఊహించుకుని.. వెలికి తీసే వరకూ లేపేది లేదంటూ.. భీష్మించుకు కూర్చున్నారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. అమరావతిని మృతనగరంగా చేయాల్సిందేనన్న కృతనిశ్చయంతో అలా వదిలేశారు. ఫలితంగా.. హైదరాబాద్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోతోంది.

అమరావతి ఇక మృత నగరం..!

మూడు నెలల కాలంలోనే అమరావతి మృతనగరంగా మారిపోయింది. అమరావతి అలా అచేతనంగా ఉండిపోవడం…. హైదరాబాద్ అభివృద్ధి జెట్ వేగంతో పెరగడానికి ఓ కారణంగా మారింది. గత నాలుగైదేళ్ల కాలంలో… హైదరాబాద్‌తో పోటీగా… రియల్ ఎస్టేట్ అమరావతిలో జోరు మీద ఉంది. ఇప్పుడు.. అమరావతిలో స్లంప్‌ ఏర్పడింది. ధరలు నలభై శాతం పడిపోయాయి. కానీ.. హైదరాబాద్ లో మాత్రం… రాష్ట్ర విభజన తర్వాత.. అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం.. ఇప్పుడు… గత నష్టాలను కవర్ చేసుకుంటూ భూమ్ లోకి వచ్చింది. ఔటర్ దాటి… హైదరాబాద్ విస్తరిస్తోంది. ధరలు కూడా.. మూడు నెలల కాలంలో 30 శాతానికిపైగా పెరిగాయి. కొత్త రాజధాని.. ప్రపంచస్థాయి నగరం అని.. పెట్టుబడులకు అమరావతి వైపు చూసిన వారంతా.. మనసు మార్చుకున్నారు. వారి చూపు మళ్లీ హైదరాబాద్ పై పడింది.

అమరావతి నుంచి హైదరాబాద్‌కు తరిమేస్తున్న ఏపీ సీఎం..!

అమరావతి అభివృద్ధి చెందితే.. ఆ ఒత్తిడి ప్రధానంగా పడేది… హైదరాబాద్ మీదనే. హైదరాబాద్‌లో.. దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు ఉన్నప్పటికీ.. వారిలో సీమాంధ్రులు ఎక్కువ. కారణం ఏదైనా కావొచ్చు కానీ… వారు తమ రాష్ట్రంలో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటే బెటర్ అనే భావనలకు గత నాలుగైదేళ్ల కాలంలో వచ్చారు. కానీ.. ఇప్పుడు వారు మనసు మార్చుకున్నారు. ఏదైనా.. హైదరాబాద్‌లోనే అన్నట్లుగా.. తమ విధానాన్ని మార్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఖరి కూడా అంతే ఉంది. అమరావతి వద్దు.. హైదరాబాద్ ముద్దు అని ఆయన పరోక్షంగా ప్రొత్సహిస్తున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునివ్వకుండా.. పెట్టే వారిని వేధించడానికి కూడా వెనుకాడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఏపీ పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిందే..!

తెలంగాణ ప్రభుత్వం కూడా… హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరినీ నిర్లక్ష్యం చేయడం లేదు. ఉద్యమకాలం నాటి ఇమేజ్ ను పూర్తిగా తుడిచి పెట్టేసింది. ఈ కారణంగా… భరోసా కూడా ఎక్కువగానే ఉంది. ఓ రకంగా ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే.. ఎవరో ఒకరు పర్సంటేజీ కోసం వస్తారు… హైదరాబాద్ లో అలాంటి బాదరబందీ లేదని రియల్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ప్రభుత్వ విధానాలు.. పాలనా తీరు.. అమరావతిని వెనక్కి నెట్టేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం కూడా అందుతూండటంతో… హైదరాబాద్ కు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రుల కలల రాజధాని .. కలగానే మిగిలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close