అనకాపల్లిలో మెడికల్ కాలేజీ స్కిట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి లండన్ బయలుదేరారు. పదిహేను రోజుల పాటు విహారయాత్ర కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్న ఆయన శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచే లండన్ బయలుదేరారు. మళ్లీ నెలాఖరులో అంటే కోర్టు ఇచ్చిన పదిహేను రోజుల గడువు ముగిసే సమయంలో వస్తారు. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు లండన్ లో ఉంటున్నారని చెబుతారు. వారి చదువులు ఎప్పుడో పూర్తయ్యాయి. అయినా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ నేతలకు ఆందోళనలు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరులో టైం పాస్ చేసేవారు. ఈ సారి లండన్ వెళ్తూ.. మళ్లీ తాను వచ్చే వరకూ రచ్చబండలు నిర్వహించాలని అసైన్ మెంట్ ఇచ్చి వెళ్లారు. కోటి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఆ సంతకాల పుస్తకాలను తాను తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ కు ఇవ్వాలని అనుకుంటున్నారు. అందర్నీ రచ్చబండ పేరుతో రోడ్లపైకి పోవాలని సూచించి తాను మాత్రం విహారయాత్రకు వెళ్లడం జగన్ స్టైల్. అయితే పార్టీ నేతలు పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు.
లండన్ నుంచి వచ్చిన తర్వాత సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. ఆయన కోర్టుకు వెళ్లకపోతూండటంతో సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టుకు వెళ్లడం అంటే.. జగన్ నామోషీగా ఫీలవుతున్నారు. తనపై జరిగిన దాడి కేసులో సాక్షిగా సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లడం లేదు. చివరికి పాస్ పోర్టు కోసం కూడా వెళ్లలేదు. మరి లండన ్నుంచి వచ్చాక అయినా వెళతారా ..ఏదో ఓ సాకుతో పిటిషన్ వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.