ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో ‘జ‌గ‌న్’ సినిమా

రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘యాత్ర‌’. మ‌హి.వి.రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. దానిపై పొలిటిక‌ల్ ముద్ర ఉన్నా స‌రే – జ‌ర్వ ప్రేక్ష‌కుల ఆమోదం పొందింది. వై.ఎస్‌.ఆర్ పార్టీకి ఆ సినిమా ఎంతో కొంత హెల్ప్ చేసింది. ఇప్పుడు ‘యాత్ర 2’కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఇది… వై.ఎస్‌.జ‌గ‌న్ సినిమా. 2024 ఎన్నిక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ పాత్ర కోసం ప్ర‌స్తుతం ఓ స్టార్ న‌టుడు కావాలి. అత‌ని కోస‌మే అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఆ న‌టుడెవ‌రో తేలిపోతే… ఈ సినిమా ప‌ట్టాలెక్కేస్తోంది. ‘యాత్ర‌’లో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న మిన‌హా.. మిగిలిన న‌టీన‌టులు కొత్త‌వాళ్లే. అయితే ఈసారి.. స్టార్ బ‌లం, బ‌ల‌గం ఎక్కువ‌గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నారు. యూవీ క్రియేష‌న్స్ కూడా ఖ‌ర్చుకి వెనుకంజ వేయ‌దు కాబ‌ట్టి.. ఈ సినిమాలో స్టార్ల‌కు కొద‌వ ఉండ‌దు. కాక‌పోతే.. ఈ సినిమాపై వైకాపా ముద్ర ఉంటుంది. వాళ్ల పార్టీ ప్ర‌చారం కోస‌మే ఈ సినిమా. దాన్ని యూవీ నెత్తిమీద వేసుకొంటే.. ఈ బ్యాన‌ర్‌పై కూడా ఆ ముద్ర ప‌డే అవ‌కాశం ఉంటుంది. దాన్ని యూవీ, ఆ సంస్థ‌లో కీల‌క భాగ‌స్వామి అయిన ప్ర‌భాస్‌.. ఎలా హ్యాండిల్ చేస్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close