తేజ్ మేనేజ‌ర్‌కి ఆఫ‌ర్లే.. ఆఫ‌ర్లు

సాయిధ‌ర‌మ్ తేజ్, త‌న మేనేజ‌ర్ స‌తీష్‌కీ మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్ గురించి ఇండ‌స్ట్రీ అంతా తెలిసిపోయింది. ఇద్ద‌రూ మంచి మిత్రులు. తేజ్ కోసం.. స‌తీష్ మేనేజ‌ర్‌గా మారాడు. అయితే.. ‘బ్రో’ సెట్లో.. వీరిద్ద‌కీ వాగ్వాదం న‌డిచింది. మాటా మాటా పెరిగి ఇద్ద‌రూ విడిపోయారు. చాలా కాలం నుంచి.. తేజ్ ద‌గ్గ‌ర న‌మ్మ‌కంగా ప‌ని చేస్తూ వ‌చ్చాడు. సాధార‌ణంగా మేనేజ‌ర్లు హీరోని అడ్డం పెట్టుకొని బాగా సంపాదిస్తారు. హీరోల రెమ్యున‌రేష‌న్ల‌లో క‌మీష‌న్లు తీసుకొని… సెటిల్ అయిపోతుంటారు. కానీ స‌తీష్ అలా కాదు. త‌న‌కి క్లీన్ ఇమేజ్ ఉంది. నిజాయ‌తీ ప‌రుడ‌నే పేరుంది. తేజ్ – స‌తీష్ గొడ‌వ‌లో.. స‌తీష్‌ది త‌ప్పులేద‌ని ఇండ‌స్ట్రీ గ‌ట్టిగా న‌మ్ముతోంది. అందుకే… ఇప్పుడు స‌తీష్‌కి ఆఫ‌ర్లు అందుతున్నాయి. `మా సంస్థ‌లో చేరు…` అంటే `మా హీరోకి ప‌నిచేయ్` అంటూ నిర్మాత‌లు త‌న‌కి మంచి ఆఫ‌ర్లు ఇస్తున్నార్ట‌. అయితే స‌తీష్ మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది.

సాధార‌ణంగా హీరోల మేనేజ‌ర్‌ల‌కు చేతినిండా సంపాద‌న ఉంటుంది. అటు హీరో పారితోషికంలో క‌మీష‌న్‌, ఇటు… నెల‌వారీ జీతం కామ‌న్‌. కానీ… స‌తీష్ మాత్రం జీతం కోసం ప‌ని చేయ‌లేదు. తేజ్ కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించాడు. `విరూపాక్ష‌`లాంటి ప్రాజెక్టులు సెట్ అవ్వ‌డంలో స‌తీష్ ది కీల‌క‌మైన పాత్ర‌. తేజ్‌కి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగినప్పుడు, త‌ను ఆసుప‌త్రి పాలైన‌ప్పుడు కంటికి రెప్ప‌లా కాపాడుకొన్నాడు. తేజ్ ద‌గ్గ‌ర సినిమాలు లేన‌ప్పుడూ, ఉన్న‌ప్పుడూ ఒకేలా ఉన్నాడు. అందుకే.. స‌తీష్‌పై అంద‌రికీ అంత క‌న్స‌ర్న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close