” మా” ఎన్నికల లో విష్ణు ఓడిపోతే జగన్ పరువు పోయినట్టేనా ?

కనీసం 900 మంది సభ్యులు కూడా లేనటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం జరుగుతున్న రచ్చ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీవీ చానల్స్ సైతం సాధారణ ఎన్నికలను లేదా రాజకీయ ఉప ఎన్నికలను తలపించే స్థాయిలో దీనికి కవరేజ్ ఇవ్వడం చూస్తుంటే ఈ ఎన్నికల పై సినీ రాజకీయ మీడియా వర్గాలతో పాటు సామాన్య ప్రజల కు కూడా ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో విష్ణు ఓడిపోతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ,ఆయన వైయస్ఆర్సిపి పార్టీ పెద్దల పరువు పోయినట్లే అన్న చర్చ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

జగన్ ప్రోద్బలం, మద్దతుతోనే రంగంలోకి దిగిన విష్ణు :

మంత్రి పేర్ని నాని ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రమేయం ఉండదని బహిరంగంగా వ్యాఖ్య లు చేశారు. అసలు ఆ ఎన్నికలపై తమ పార్టీకి ఆసక్తి కూడా లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఆశీస్సులతోనే విష్ణు ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు అనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. విష్ణు రంగంలోకి దిగడానికి కొద్ది రోజుల ముందు మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని వ్యక్తిగతంగా కలవడం, కలిసిన తర్వాత మంచు మనోజ్ జగన్ విజనరీ ముఖ్యమంత్రి అని జగన్ పై పొగడ్తల వర్షం గుప్పించడం తెలిసిందే. అయితే అప్పట్లో హఠాత్తుగా మంచు మనోజ్ జగన్ ని ఎందుకు కలిశారు అనేది ప్రజలకు అర్థం కాలేదు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడానికి సినీ పెద్దలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి జగన్ కి సమయం లేనందువల్లే మంత్రి పేర్ని నాని ఆయనతో చర్చలు జరుపుతున్నారని, జగన్ సినీ పెద్దలను కలవడం కుదరనంత బిజీగా ఉన్నాడని అప్పట్లో ఊదరగొట్టిన వైఎస్ఆర్సిపి మీడియా కూడా మంచు మనోజ్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి మాత్రం జగన్ కి సమయం ఎలా దొరికింది అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమీలింది.

నా చేతుల్లో ఏమీ లేదు అంతా పై నుండి నడిపిస్తున్నారు అన్న మోహన్ బాబు:

ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె ప్రోగ్రాం కి మోహన్ బాబు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ విష్ణు ని ఎన్నికల నుండి ఉపసంహరింప చేయడం కూడా తన చేతుల్లో లేదని అంతా పై నుండి నడిపిస్తున్నారని మోహన్ బాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ల తో పాటు హేమ, జీవిత , సీవీల్ నరసింహారావు వంటి వారందరూ పోటీ పడినప్పటికీ వారు ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరి పోయారు. అయితే మంచు విష్ణువర్ధన్ బాబు మాత్రం ఏకగ్రీవానికి ససేమిరా అంటూ ప్రవర్తించడానికి కారణం కూడా వైఎస్ఆర్సిపి పెద్దలు పరోక్షంగా ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన పోటీ నుండి వైదొలగకుండా చేయడమే కారణం అని సమాచారం.

చిరంజీవి పరువు పోతుందా? జగన్ పరువు పోతుందా ?

మెగాస్టార్ చిరంజీవి ఏనాడు కూడా ప్రకాష్ రాజ్ కి బహిరంగంగా తన మద్దతు ప్రకటించలేదు. అయినప్పటికీ నాగ బాబు ప్రకాష్ రాజ్ కి బహిరంగంగా మద్దతు పలికిన కారణంగా, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి మద్దతుగా ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చిరంజీవి మద్దతు ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. అయితే గతంలో చిరంజీవిని పెద్ద ఎత్తున వ్యతిరేకించిన జీవిత వంటివారు కూడా ఈ ప్యానల్ లో ఉండడం గమనార్హం. అయినప్పటికీ వైకాపా వర్గం మీడియా ప్రకాష్ రాజ్ ఓడిపోతే చిరంజీవి పరువు పోయినట్లే అని గట్టిగా ప్రచారం మొదలు పెట్టింది.

అయితే ఫిలిం నగర్ వర్గాల లో మాత్రం మంచు విష్ణు ఓడిపోతే జగన్ పరువు పోయినట్లే అన్న చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమని తొక్కడానికి, సినీ పరిశ్రమలోని కొంతమంది ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది అన్న ప్రచారం బాగా జరిగింది. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమలోని కొందరు జగన్ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నారు. మోహన్ బాబు గత ప్రభుత్వ హయాంలో రోడ్లపైకి వచ్చి మరీ ఆ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకున్న కారణంగా, అంతేకాకుండా విష్ణు, జగన్ తమకు బంధువులని గతంలో చెప్పిన కారణంగా, మంచు మనోజ్ ముఖ్యమంత్రి జగన్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తి వేసిన కారణంగా, మంచు ఫ్యామిలీ వైకాపా అనుకూలురు అన్న అభిప్రాయం ఏర్పడింది. అదేవిధంగా విష్ణు వర్గాన్ని సమర్థించే వారిలో కూడా చాలా వరకు వై ఎస్ ఆర్ సి పి ముద్ర కలిగిన వారు కావడం గమనార్హం. ఈ అంశాల కారణంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తో తమ పార్టీకి సంబంధం లేదు అని మంత్రి పేర్ని నాని ప్రకటించినప్పటికీ విష్ణు ఓడిపోతే జగన్ పరువు పోయినట్లే అన్న వాదన ఇంకొక వర్గం నుండి వినిపిస్తోంది.

ఇది కేవలం ప్రకాష్ రాజ్ మరియు విష్ణు ల మధ్య పోటీ అయినప్పటికీ, ఒక వర్గం మీడియా ప్రకాష్ రాజ్ ఓడిపోతే చిరంజీవి ఓడిపోయినట్లే అని ప్రచారం చేస్తూ ఉండడంతో, మరి అది నిజమైతే – విష్ణు ఓడిపోతే జగన్ ఓడిపోయినట్లే అన్న ప్రచారం కూడా సబబే అన్న వాదన మరో వర్గం నుండి బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఎవరు గెలుస్తారో తెలియడానికి మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close