వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సిగ్గూ, ఎగ్గూ లేవని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఆయన నిర్మోహమాటంగా చెప్పే అబద్దాలు, తాను చేసిన ఘనకార్యాలను సమర్థించుకునే విధానం, తమ పార్టీ నేతల దోపిడీలు, హత్యలను సైతం సహజమని చెప్పే సందర్భాల్లో ఆయన హావభావాలు చూస్తే నిజంగానే ఆయనకు అలాంటివేమీ లేవని.. వైసీపీ నేతలతో పాటు సామాన్య జనానికీ అనిపిస్తాయి. సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని ప్రెస్మీట్లో జగన్ చెప్పిన విధానం చూసిన తర్వాత.. ఈయనేం రాజకీయనాయకుడని.. అలాగే అనుకుంటున్నారు జనం.
అసెంబ్లీకి వెళ్లడానికి భయం ఎందుకు?
చంద్రబాబు ఎన్ని రోజులు వచ్చాడని తాను అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని సమర్థించుకుంచున్నారు జగన్. చంద్రబాబు అసెంబ్లీకి వెళ్తే అసురుల్లా ఎలా ప్రవర్తించారో అందరూ చూశారు. అందరూ అలా ప్రవర్తించి.. తన మానసిక వికృతాన్ని శాటిస్ ఫై చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండలేక చంద్రబాబు వెళ్లిపోయారు. జగన్ రెడ్డికి అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా అదే పని చేయవచ్చు.కానీ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలను పంపారు. జగన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదు. కానీ దాన్ని సమర్థించుకుంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వడం లేదని అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడానికి అసలు కారణం.. చంద్రబాబుకు తాము చేసినట్లుగా.. తనకూ చేస్తారన్న భయమే.
ప్రజాస్వామ్య “సోల్” తెలుసుకోలేని లీడర్ సక్సెస్ అవుతాడా ?
ప్రజాస్వామ్యం స్ఫూర్తిని .. తెలుసుకోలేని లీడర్ ఎప్పటికీ సక్సెస్ కాలేడు. జగన్ రెడ్డికి రాజకీయం అంటే ఓట్లు అని మాత్రమే తెలుసు. చంద్రబాబు, టీడీపీపై వ్యతిరేకత వస్తే జనం తనకే ఓటు వేస్తారని.. తాను ఏం చేసినా సరే పట్టించుకోరని ఆయన అనుకుంటున్నారు. అక్కడే ప్రజల్ని ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ఎవరికీ ప్రజలు పట్టం కట్టిన చరిత్ర ఇప్పటి వరకూ లేదు. సరైన కారణం లేకుండా అసెంబ్లీని బహిష్కరించిన వారు రాజకీయాల్లో కనుమరుగైపోయారు. ఘోరమైన ట్రాక్ రికార్డు పెట్టుకుని ప్రజల బలాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న జగన్ రెడ్డి ఎంత ?
చేసిన పాపాలకు అనుభవించాల్సిందే !
జగన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో చేసిన పాపాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనుభవించిన ప్రజలకు.. ఆయన వికృత మనస్థత్వానికి బలైన నేతలకు తెలుసు. రాజకీయం అంటే వ్యక్తిగత శతృత్వం అనుకునే మంద బుద్దికి..ఇతరుల చావు కోరుకునే దారుణమైన మనస్థత్వానికి జగన్ నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తున్నారు. కానీ చేసిన పాపాలకు ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే. ఇప్పటికే ఆయన అనుభవిస్తున్నారు. కానీ దానికి ప్రాయశ్చితం కూడా రాకుండా చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఎక్కువ శిక్షలకు అర్హత సాధిస్తున్నారు.