జగన్ రెడ్డికి ఎవరు పిచ్చి పట్టిస్తున్నారు?. ఎవరో కాదు ఆయన గట్టి గా నమ్ముతున్నవారే. గూగుల్ ఏఐ హబ్ విశాఖలో పెట్టుబడులు పెడుతోందని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ వచ్చింది గూగుల్ ఏఐ హబ్ కాదని.. అదాని డేటా సెంటర్ అని జగన్ తో చెప్పించారు. ఎందుకంటే క్రెడిట్ కోసం. గతంలో అదాని డేటా సెంటర్ కోసం కాపులుప్పాడ కొండను రాసిచ్చారు. దానిపై పనులేమీ జరగలేదు. అదే డేటా సెంటర్ అంటారు జగన్. ఆయనతో అలా చెప్పిస్తోంది స్ట్రాటిస్టులు. అంతా బయటపడిన తర్వాత తాజాగా.. గూగుల్ కు భూములు అప్పగిస్తూ ఇచ్చిన జీవోలో అదాని పేరు ఉందని.. అదాని డేటా సెంటరేనని వాదిస్తూ కథనం రాసేశారు. జగన్ చెప్పిందే నిజమని నమ్మించేశామని అనుకుంటున్నారు.
ఆ జీవోలో అదానితో పాటు భారతి ఎయిర్ టెల్ పేరు కూడా..!
గూగుల్ పూర్తి స్థాయి సబ్సిడలీ రైడెన్ ఇన్ ఫో టెక్ కంపెనీకి ప్రభుత్వం భూములు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూముల్లో గూగుల్ తరపున పనులు చేపట్టబోయేది అదానీ గ్రూపు, భారతి ఎయిర్ టెల్ గ్రూపు. ఈ రెండు సంస్థలకు గూగుల్ పనులు చేయాలని కాంట్రాక్టు ఇచ్చింది. పనులు చేసి వారు బిల్లులు తీసుకుంటారు. కట్టిన వాళ్లదే కంపెనీ.. కట్టిన వాళ్లతే ఇల్లు అని ఎలా చెప్పుకోరో.. ఇది కూడా అంతే. అయినా ప్రజల్ని నమ్మించడానికి జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గూగుల్ తో ఢిల్లీలో ఒప్పందం జరిగిన రోజున.. అదానీ గ్రూపు, భారతి ఎయిర్ టెల్ గ్రూపు రెండూ.. తాము కూడా అందులో భాగమవుతన్నామని ప్రకటించాయి. కానీ వారు ఒప్పందాల్లో లేరు. ఎందుకంటే వారు గూగుల్ తో ఒప్పందం చేసుకుంటారు. వారిది పనుల కాంట్రాక్ట్. ఇది తెలిసి కూడా ప్రజల్ని నమ్మించాలని సాక్షి ప్రయత్నిస్తూనే ఉంది.
జగన్ కు రాసిచ్చిన స్క్రిప్టును నిజం చేయాలని తపనా?
జగన్కు గిలిగింతలు పెట్టడానికి అది మనం తీసుకొచ్చిందేఅన్నా అని స్క్రిప్టు రాయించి మీడియా ముందు చెప్పించి.. పెద్ద జోకర్ ను చేసేశారు. ఆ మాటను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే అది అదాని డేటా సెంటర్ అయితే అదానీ వాళ్లు చెప్పుకోవాలిగా. అదే నిజం అయితే గౌతం అదానీనే ఒప్పందం చేసుకోవాలిగా. గూగుల్ నుంచి ఉన్నత అధికారులు.. ఏకంగా క్లౌడ్ సీఈవో వచ్చి ఎందుకు ఒప్పందం చేసుకుంటారు. ఆ మాత్రం బుర్ర ప్రజలకు ఉండదా. అదానీది అని జగన్ చెప్పగానే అదానీది అయిపోతుందా..కనీసం అదానికి కూడా తెలియదా?
ఎందుకు ఇలాంటి వితండవాదాలు.. పరువు తీసుకోవడానికి !
అడ్డంగా దొరికిపోయిన తర్వాత అడ్డగోలుగా అబద్దాలు ఆడటం వైసీపీ జీన్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే.. తమను నమ్మేవారు కొంత మంది ఉంటారని.. వారిని అలా నమ్మిస్తూ ఉండాలని అనుకుంటారు. నిజానికి అలాంటి వారు రాను రాను తగ్గిపోతున్నారు. పక్కా ఫేక్ ప్రపంచంలో తమను లాగేసి.. రాజకీయ లబ్ది పొందుతున్నారని వారికి క్లారిటీ వస్తోంది. అందుకే వైసీపీ పరిస్థితి ఘోరంగా మారుతోంది. కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు క్లౌన్స్గా మారుతూనే ఉన్నారు.. జగన్ ను మారుస్తూనే ఉన్నారు.
