జగన్ రెడ్డికి ప్రజాధనం దోచుకోవడమే కాదు.. క్రెడిట్ చోరీ చేయడం కూడా వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా వైసీపీ రంగులేసి అంతా నేనే కట్టించానని నమ్మించాలనుకున్నారు. కియా దగ్గర్నుంచి అన్నీ తానే అని ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి రావాల్సిన పరిశ్రమల్ని తరిమేశారు. ఇప్పుడు ఓడిపోయాక.. ఏపీ ప్రభుత్వం నానా తిప్పలు పడి..జగన్ రెడ్డి అనే భూతం మళ్లీ రాదని భరోసా కల్పించి పెట్టుబడులు తెస్తూంటే.. నేను వేసిన విత్తనం..మేము వేసిన బాటలోనే అన్నీ వస్తున్నాయని క్రెడిట్ చోరీ చేస్తున్నారు.
తాడేపల్లికి వచ్చినందుకు గుర్తుగా ఈ సారి స్టూడెంట్స్ పేరుతో కొంత మందిని పిలిపించుకుని కబుర్లు చెప్పారు. ఇందులో గూగుల్ డేటా సెంటర్ ను తానే తెచ్చానని చెప్పుకున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు. అసలు జగన్ రెడ్డి హయాంలో గూగుల్ అనే పేరే వినిపించలేదు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే తెచ్చానని క్రెడిట్ చోరీ చేయడమే కాకుండా… ఎదురుగా చంద్రబాబు చోరీ చేస్తున్నారని చెబుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును చంద్రబాబు ప్లాన్ చేసి భూసేకరణ చేస్తే.. భూములు ఇవ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టి.. తాను వచ్చాక ఎయిర్ పోర్టును రద్దు చేసి ఎవరి భూములు వారికి ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పుడు తానే ఎయిర్ పోర్టును తెచ్చానని అంటున్నారు. ఐదేళ్లలో కనీస మాత్రం పనులు చేయించలేదు.
జగన్ ఇలా ఇలా ఒకటి కాదు.. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి మంచిపనిని క్రెడిట్ కొట్టేయడం కామన్ గా మారుతోంది.గతంలో కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారంటూ ఓ ఫేక్ లెటర్ తో కొట్టేసే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు కూడా విద్యార్థుల ముందు అదే ప్రయత్నం చేశారు. ఆయన పని తనం పరిశ్రమల్ని తీసుకు రావడంలో కాకుండా… వెళ్లగొట్టడంలో ఉంటుందని .. కానీ ఈ క్రెడిట్ చోరీ విషయంలో మాత్రం ఏ మాత్రం సిగ్గుపడరని మరోసారి స్పష్టమయింది.
