ప్రధాని నరేంద్రమోదీ అధికార ప్రస్థానంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇరవై ఐదు సంవత్సరాల కిందట గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఇదే రోజున ప్రత్యేక పరిస్థితుల్లో పదవి చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఓటమి అనే మాటే లేదు. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో పంచుకోగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్డీఏ నేతలంతా శుభాకాంక్షలు చెప్పడం కామనే. బీజేపీని వ్యతిరేకించేవాళ్లు.. బీజేపీతో స్నేహం చేయలేని వాళ్లు.. బీజేపీ తీవ్రంగా విమర్శించే పార్టీలు సహజంగానే విష్ చేయరు. కానీ జగన్ రెడ్డి మాత్రం భిన్నం. ఆయన పై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతూంటారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలు కూడా… ఆయనను జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ ఉంటారు.కానీ జగన్ మాత్రం.. మోదీకి ఎప్పుడు శుభాకాంక్షలు చెప్పే అవకాశం వస్తుందా అని ఎదురు చూసి అందరి కంటే ముందే తెల్లారగానే ఓ ట్వీట్ పెట్టేస్తారు.
కేసుల భయంతో జగన్ రెడ్డి వణికిపోతున్నారు. మోదీపై..బీజేపీపై ఆయనకు ఎలాంటి ప్రేమ లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే .. ఆయన ఈ పాటికి తన తండ్రి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అని..తాను కాంగ్రెస్ వల్లే ఈ స్థితిలో ఉన్నానని కావాలంటే పార్టీని విలీనం చేస్తానని ప్రకటించి ఉండేవారు. ఆయన చేసిన తప్పులు.. దోపిడీ అలాంటివి. ఇప్పుడుమోదీని.. బీజేపీని కాకాపట్టడం ద్వారా కొంత కాలం అయినా జైలుకెళ్లకుండా ఉండాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. ఎంతకాలం ఆయన ఇలా ఉంటారో కానీ.. ఆయన తీరు చూసి.. ఇలా వెన్నుముకలేని రాజకీయం చేసి ఏం సాధిస్తారోనని గుసగుసలాడుకుుంటున్నారు.