జగన్ మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకొన్నారా?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తెదేపా కూడా ఊహించలేని గొప్పగొప్ప వ్యూహాలతో ముందుకు వస్తుంటారు కానీ వాటి కోసం అయన ఎంచుకొన్న సమయం, సందర్భం సరిగా లేకపోవడం చేతనో లేదా వాటిని సరిగ్గా అమలు చేయలేకనో ఎదురుదెబ్బలు తింటుంటారు. ఉదాహరణకి రాజధాని భూసేకరణ, తెలంగాణా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, ప్రత్యేక హోదా కోరుతూ ఆయన చేసిన దీక్షలు ఏవిధంగా ముగిసాయో గుర్తు చేసుకొంటే ఆ విషయం అర్ధం అవుతుంది. తాజాగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయించాలనే సరికొత్త వ్యూహాన్ని తొందరపడి బయటపెట్టుకొని ఎదురుదెబ్బలు తింటున్నారు. ఆయన మొన్న ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టుకొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు వారి చేత రాజీనామాలు చేయించాలనుకోవడం లేదని సర్ది చెప్పుకొన్నారు. తగిన సమయం, సందర్భం చూసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్పారు.

వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయించాలనే మాటని ఆయన యాదృచ్చికంగా చెప్పారనుకోలేము. అటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని ఎంపిలతో, పార్టీ నేతలతో చర్చించకుండా హటాత్తుగా ప్రకటించే అవకాశమే లేదు. ఒకవేళ ప్రకటించి ఉంటే అది ఆత్మహత్యాసదృశమైనదే. కనుక అది వ్యూహాత్మకమైన ప్రకటనగానే చూడవలసి ఉంటుంది. కానీ దానితో ఆయన ఆశించింది ఒకటైతే జరిగేది, జరుగుతున్నది మరొకటి కావడమే విశేషం.

ఆ విధంగా ప్రకటించి తెదేపాని హడలెత్తించాలని అనుకొంటే, తెదేపా అయన ప్రకటనని స్వాగతించింది. పైగా తక్షణం ఆయన తన ఎంపిల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకి వెళ్ళి తనకున్న ప్రజాధారణని రుజువు చేసుకోవాలని తెదేపా నెల్లూరు నగర అధ్యక్షుడు కోటం రెడ్డి జగన్ కి సవాలు విసిరారు. ఇది జగన్ ఊహించని ప్రతిక్రియేనని చెప్పవచ్చు. వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తానని చెప్పగానే, తెదేపా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజిల గురించి ఏదేదో మాట్లాడేసి తన ఉచ్చులో చిక్కుకొంటుందని భావిస్తే, జగన్ ప్రతిపాదనని స్వాగతించి పెద్ద షాక్ ఇచ్చింది.

తెదేపాని కవ్విద్దామనుకొంటే అదే తిరిగి కవ్విస్తోంది. రాజీనామాలు చేసి చూపమని సవాలు విసురుతోంది. జగన్ ఇప్పుడు తన మాటకి కట్టుబడలేరు అలాగని వెనక్కి తగ్గలేరు. మాటకి కట్టుబడితే పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. కట్టుబడకపోతే తెదేపా నేతలు ఇదే విధంగా ఎద్దేవా చేస్తూనే ఉంటారు. సమయం కాని సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడటం ఆనక ఎదురుదెబ్బలు తినడం కూడా జగన్ కి అలవాటుగా మారిపోయినట్లుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

కేసీఆర్ సుదీర్ఘ డిమాండ్లన్నీ తీర్చేసిన మోదీ !

తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ రేపోమాపో రానున్న సమయంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ కోసమే జరిగిందా అన్నట్లగా నిర్ణయాలు తీసుకున్నారు. పసుపుబోర్డు ఏర్పాటును ముందు బహిరంగలో ప్రకటించారు. తాజాగా కేబినెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close