అవినీతిపరులపై ఔదార్యమా!?

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరంలో అసలు గుట్టురట్టయింది. ఎక్కడెక్కడ చెరువులను కబ్జాలు చేసి భవంతులు కట్టారో వరద నీరే స్పష్టంగా చెప్పింది. అంతే కాదు, జి హెచ్ఎం సి లో అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా అందరికీ తెలిసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ విషయాన్ని ప్రకటించారు.

నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందేనంటూ మొన్న శనివారం నాడు ఘంటాపథంగా చెప్పారు కేసీఆర్. అక్రమ కట్టడాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటే బల్దియాలో ఒక్కరూ మిగలరని కేసీఆర్ చెప్పారు. అంటే ఆ స్థాయిలో అవినీతి ఉందన్నమాట. మరి రెండేళ్ల మూడు నెలలుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పలేదు.

ఇప్పుడు వరదలతో ఈ సమస్య రాకపోతే ఇకముందు కూడా బల్దియాలో అవినీతి అక్రమాలు కొనసాగేవే అని నమ్మడానికి పెద్దగా తెలివి తేటలు అవసరం లేదు. చిన్న లాజిక్ చాలు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉంటానని చెప్పింది. మరి ఇంత భారీ అవినీతిని ఎలా ఉపేక్షించారో ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే ఇప్పుడు మున్సిపల్ మంత్రి. మరి అవినీతి విషయంలో తండ్రీకొడుకులు ఉక్కు పాదం మోపకుండా ఉపేక్షించడం అంటే అక్రమార్కులకు భయం లేకుండా చేయడమే కదా.

ప్రతిదానికీ గత పాలకులనే తిట్టడం సరే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకూ అవినీతిపై అంకుశం ప్రయోగించడానికి సమయం దొరకలేదా అని ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పాల్సిందే. పైగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని గొప్పగా ప్రకటించారు. సదరు అక్రమ నిర్మాణాల్లో చెరువుల్లో నిర్మించినవీ ఉంటాయనే చిన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియదని అనుకోవాలా? రెగ్యులరైజేషన్ పేరుతో ఖజానాలోకి 157 కోట్ల రూపాయలు వచ్చి చేరాయని సర్కారు సంబరపడినప్పుడు ఈ స్పృహ ఏమైందో అర్థం కాదు.

స్వయంగా ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి పదే పదే ఆదేశించినా కనీస స్థాయిలో స్పందించని బల్దియా వారిపై చర్య తీసుకున్న దాఖలాలు లేవు. తాను గుంతలు పూడ్చాలని స్వయంగా కమిషనర్ కు చెప్పిన మార్గంలోనే కేటీఆర్ రెండుమూడు సార్లు వెళ్లినా మార్పు లేదు. ఇంతటి ఘనమైన బల్దియాలో అవినీతి, అసమర్థతపై కేసీఆర్, కేటీఆర్ లు అంతులేని ఔదార్యాన్ని ప్రదర్శించడానికి కారణం ఏమిటో వాళ్లే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close